GST Reforms : ఏంటి భయ్యా... ఒక్కరోజులో 30,000 కార్లు అమ్మేశారా..!

Published : Sep 24, 2025, 01:01 PM IST

GST Reforms : కొత్త జీఎస్టీ 2.0 సంస్కరణలతో భారత ఆటోమొబైల్ రంగం పండుగ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. తొలిరోజే 30,000కు పైగా కార్లను అమ్మినట్లు మారుతి సుజుకి తెలిపింది.

PREV
16
ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఊపు

GST Reforms : పండగల సీజన్ కాబట్టి సహజంగానే ఆటోమొబైల్ రంగం మంచి ఊపుమీద ఉంటుంది... అందులోనూ ఇప్పుడు వస్తు సేవల పన్ను (GST) తగ్గింపుతో ఆ దూకుడు మరింత పెరిగింది. ముఖ్యంగా వ్యక్తిగత, కుటుంబ ప్రయాణాల కోసం ఉపయోగించే టూవీలర్స్, కార్ల ధరలు భారీగా తగ్గాయి... దీంతో ఇదే మంచి సమయంగా భావిస్తున్న వినియోగదారులు ఆ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రికార్డుస్థాయిలో సేల్స్ నమోదవుతున్నాయి.

26
మారుతి సుజుకి రికార్డ్ సేల్స్

జిఎస్టి తగ్గింపు అమలులోకి వచ్చిన సెప్టెంబర్ 22 నే దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. ఇది చాలా మంచిరోజు కావడంతో ప్రజలు ఇష్టమైన కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తెలిపాయి. మారుతి సుజుకి అయితే ఈ ఒక్కరోజే (గత సోమవారం) ఏకంగా 30,000 కార్లను అమ్మినట్లు చెబుతోంది. ఇది మారుతి సుజుకి చరిత్రలోనే అత్యధిక సేల్స్ రికార్డుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.

36
మారుతి సుజుకి దూకుడు

సేల్స్ మాత్రమే కాదు ఎంక్వయిరీలు భారీగా పెరిగాయని మారుతి సుజుకి వెల్లడించింది. కొన్ని టాప్ వేరియంట్లకు స్టాక్ కూడా అయిపోవస్తోంది.. అందుకే మ్యాన్యుఫాక్చరింగ్ ను కూడా వేగవంతం చేసినట్లు ఈ కంపెనీ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. కస్టమర్లకు కార్లు డెలివరీ చేయడానికి డీలర్లు రాత్రి వరకు షోరూమ్‌లను తెరిచి ఉంచుతున్నారని మారుతి సంస్థ చెబుతోంది.

46
ఏమిటీ... కేవలం 3.4 లక్షలకే కొత్త కారా..!

జీఎస్టీ తగ్గింపుతో అత్యంత తక్కువధరకే కార్లు లభిస్తున్నాయి... మారుతి ఆల్టో k10 కారు కనీస ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 3.4 లక్షలకు తగ్గింది. దీన్నిబట్టే జిఎస్టి తగ్గింపుతో కార్ల ధరలు ఏ స్థాయిలో తగ్గాయో అర్థంచేసుకోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో ఈ జిఎస్టి సంస్కరణలు విప్లవం సృష్టిస్తున్నాయి... బైక్ కొనే బడ్జెట్‌లో కొంచెం అదనంగా పెట్టి ఇప్పుడు కారు కొనొచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

56
హ్యుందాయ్ రికార్డ్

ఇక మరో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కూడా సెప్టెంబర్ 22న రికార్డు సేల్స్ నమోదు చేసింది. ఈ ఒక్కరోజే దాదాపు 11,000 కార్లను విక్రయించినట్లు డీలర్ల నుండి సమాచారం అందినట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (HMIL) ప్రకటించింది. గత ఐదేళ్లలో ఇదే రికార్ట్ సేలింగ్ గా హ్యుందాయ్ పేర్కొంటోంది. జిఎస్టి ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకే అందిస్తున్నామని... దీన్నివల్ల కార్ల ధరలు తగ్గి సేల్స్ అమాంతం పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి.

66
పండగల సీజన్లో బంపరాఫర్

సరైన సమయం జీఎస్టీ సంస్కరణల, పండగల సీజన్ రావడంతో కస్టమర్లకు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి... దీంతో వారిలో నమ్మకాన్ని పెంచింది. చిన్న కార్లకు జీఎస్టీ రేటు 28% నుంచి 18%కి తగ్గింది... కానీ పెద్దపెద్ద లగ్జరీ కార్లపై మాత్రం జిఎస్టి 40%గా ఉంది. ఇలా మద్యతరగతి ప్రజలు ఫోర్ వీలర్ కలను ఈ పండగ సమయంలో నిజం చేసుకునేందుకు కేంద్రం చక్కటి అవకాశం ఇచ్చింది.

టూవీలర్లకు జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. ట్రాక్టర్లపై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ పన్ను శ్లాబులను 5%, 18%గా, లగ్జరీ వస్తువులకు 40%గా మార్చింది.

Read more Photos on
click me!

Recommended Stories