ప్రపంచంలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదే ! లీటరుకు ఏకంగా 45 కిలో మీటర్లు !

Published : Apr 18, 2026, 08:48 AM IST

Geely New AI Hybrid Car: చైనాకు చెందిన గీలీ ఆటో సరికొత్త ఐ-హెచ్ఈవీ హైబ్రిడ్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇది లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ వాహన రంగంలో సంచనలంగా మారింది. 1997  నుంచి జపాన్ కంపెనీలు హైబ్రిడ్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.

PREV
15
టొయోటా, మారుతీలకు చెక్.. లీటరుకు 45 కి.మీ మైలేజ్ ఇచ్చే కొత్త కార్

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్ కార్ల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మనకు జపాన్ కంపెనీలైన టొయోటా, మారుతీ సుజుకి వంటి పేర్లే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారబోతున్నాయి. చైనాకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీ 'గీలీ ఆటో' ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే హైబ్రిడ్ వ్యవస్థను పరిచయం చేసింది. గీలీ రూపొందించిన ఈ కొత్త ఐ-హెచ్ఈవీ ఇంటెలిజెంట్ హైబ్రిడ్ సిస్టమ్ లీటరు పెట్రోల్‌కు ఏకంగా 45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది సాధారణ హైబ్రిడ్ కార్ల కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

25
రికార్డు స్థాయి మైలేజ్: ఢిల్లీ టూ ముంబై కేవలం రూ. 3000లోనే

గీలీ తన ఎం గ్రాండ్ మోడల్‌లో ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించింది. ఈ పరీక్షల్లో కేవలం 2.22 లీటర్ల ఇంధనంతో కారు 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. దీనిని బట్టి చూస్తే లీటరుకు దాదాపు 45 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ అద్భుతమైన ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో కూడా చోటు సంపాదించుకుంది.

ఈ మైలేజీని భారతీయ పరిస్థితులతో పోల్చి చూస్తే, సుమారు 1400 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ నుండి ముంబై ప్రయాణాన్ని కేవలం 3000 రూపాయల పెట్రోల్ ఖర్చుతోనే పూర్తి చేయవచ్చు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యులకు ఇది ఒక వరం లాంటి వార్తని చెప్పాలి.

35
ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్

గీలీ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కేవలం మైలేజీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇందులో అత్యాధునిక ఏఐ ఆధారిత ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను అమర్చారు. ఈ స్మార్ట్ సిస్టమ్ ప్రయాణించేటప్పుడు బయట ఉన్న ఉష్ణోగ్రత, గాలిలో తేమ, సముద్ర మట్టం నుండి ఎత్తు వంటి అంశాలను రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇంజిన్ నుండి శక్తిని ఏ విధంగా వాడాలో కారు స్వయంగా నిర్ణయించుకుంటుంది. దీనివల్ల ఏ పరిస్థితుల్లోనైనా కారు గరిష్ఠ మైలేజీని, మెరుగైన పనితీరును అందిస్తుంది. అదనంగా, ఈ కారులో ఉన్న కంప్యూటింగ్ పవర్ సాధారణ హైబ్రిడ్ కార్లలో కనిపించని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

45
2026లోనే మార్కెట్లోకి కొత్త మోడల్స్

ఈ విప్లవాత్మకమైన టెక్నాలజీని 2026లోనే తన వివిధ మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని గీలీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రిఫేస్, మోంజారో, స్టార్రే, ఎం గ్రాండ్ వంటి మోడల్స్ ఈ హైబ్రిడ్ వ్యవస్థతో రానున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే టెక్నాలజీని సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయడమే లక్ష్యంగా గీలీ పనిచేస్తోంది. ఇది రానున్న రోజుల్లో మధ్యతరగతి వాహనదారులను పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం ఉంది.

55
జపాన్ కంపెనీలకు గట్టి సవాలు

గీలీ తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెద్ద మలుపుగా నిపుణులు భావిస్తున్నారు. షాంఘైకి చెందిన ఆటోమోటివ్ ఫోర్‌సైట్ మేనేజింగ్ డైరెక్టర్ యేల్ జాంగ్ అభిప్రాయం ప్రకారం.. గీలీ సిస్టమ్ శక్తివంతమైన మోటార్, అతి తక్కువ ఇంధన వినియోగం, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తోంది. ఇది టొయోటా వంటి జపాన్ కంపెనీలకు నేరుగా సవాలు విసురుతోంది. 1997లో టొయోటా ప్రియస్ విడుదలైనప్పటి నుండి జపాన్ కంపెనీలు హైబ్రిడ్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న దేశాల్లో హైబ్రిడ్ కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు చైనా కంపెనీ ఈ రంగంలోకి దూసుకొస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories