టాటా మోటార్స్ నుంచి రూ.10 లక్షల లోపు ధరలో లభించే టాప్ 10 కార్ల జాబితా ఇదే. వాటి ధర, మైలేజ్, సేఫ్టీ ఫీచర్ల వంటి పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.. కొత్తకారు కొనాలనుకునేవారు తప్పక తెలుసుకోండి…
Tata Motors : కొత్త కారు కొనాలనుకునే వారు మోడల్, మైలేజ్, టెక్నాలజీతో పాటు ధరను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ దాదాపు పది మోడళ్లను విక్రయిస్తోంది.
25
బడ్జెట్ ప్రెండ్లీ టాటా కార్లు...
తక్కువ ధరలో కారు కావాలనుకునేవారికి టాటా టియాగో (ప్రారంభ ధర రూ. 4.57 లక్షలు) మంచి ఆప్షన్. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం చూసేవారు టాటా ఆల్ట్రోజ్‌ను (ధర రూ. 6.30 లక్షల నుంచి రూ. 10.51 లక్షలు) ఎంచుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో టాటా నుంచి ఉన్న ఏకైక సెడాన్ కారు టిగోర్. దీని ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉంది.
ఇక ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పంచ్ (ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు), నెక్సాన్ (ధర రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.15 లక్షలు), కర్వ్ (ప్రారంభ ధర రూ. 9.66 లక్షలు) ఉన్నాయి. టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు కాగా, పంచ్ ఈవీ రూ. 9.69 లక్షల నుంచి అందుబాటులో ఉంది.
35
భద్రత విషయంలో టాటా టాప్
టాటా మోటార్స్ భద్రత విషయంలో రాజీపడదు. టాటా పంచ్, నెక్సాన్, ఆల్ట్రోజ్, కర్వ్ మోడళ్లు గ్లోబల్ సేఫ్టీ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించాయి. పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్, ఎలక్ట్రిక్ అనే నాలుగు ఇంధన ఆప్షన్లలో కార్లను అందిస్తున్న ఏకైక సంస్థ టాటా.
మైలేజ్ విషయానికొస్తే, ఆల్ట్రోజ్ లీటర్‌కు గరిష్ఠంగా 27.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ విభాగంలో పంచ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 నుంచి 468 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు రూ.10 లక్షల లోపు కార్లలోనూ లభిస్తున్నాయి.
మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు టాటా మోటార్స్ కొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.8.10 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. ఇక కొత్త ఫీచర్లతో న్యూ నెక్సాన్ 2027లో వస్తుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
55
మీరు ఫస్ట్ కారు కొంటుంటే ఇవి బెస్ట్ ఆప్షన్
మీరు తక్కువ ధరలో మొదటి కారు కొనాలనుకుంటే, టియాగో లేదా టిగోర్ సరైన ఎంపిక. సిటీ ప్రయాణాల్లో ఎక్కువ మైలేజ్ కావాలంటే ఆల్ట్రోజ్‌ను పరిశీలించవచ్చు. నాణ్యమైన ఎస్‌యూవీ కావాలనుకుంటే నెక్సాన్ మంచి ఆప్షన్. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి టాటా ఎలక్ట్రిక్ మోడళ్లు బెస్ట్ ఛాయిస్.