Renault Triber : కేవలం రూ.50,000 ఉంటే చాలు.. ఈ సూపర్ 7 సీటర్ ఇంటికి పట్టుకెళ్లండి

Published : Jan 20, 2026, 06:57 PM IST

మీరు కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించే కారు కోసం చూస్తున్నారా? అయితే రెనాల్ట్ ట్రైబర్ మీకు ఉత్తమ ఎంపిక. దేశంలోనే అత్యంత చవకైన ఈ 7-సీటర్ కారును కేవలం రూ.50 వేలకే ఇంటికి తీసుకురావచ్చు. అదెలాగో చూద్దాం... 

PREV
15
రెనాల్ట్ ట్రైబర్ ఆన్ రోడ్ ధర...

భారత మార్కెట్లో 2025 రెనాల్ట్ ట్రైబర్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.15 లక్షలు. మీరు ఈ బేస్ మోడల్ (RXE)ను ఢిల్లీలో కొంటే ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7 లక్షలు అవుతుంది. ఈ ధరలో రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి.

25
రెనాల్ట్ ట్రైబర్ డౌన్ పేమెంట్, EMI

మీరు 2025 రెనాల్ట్ ట్రైబర్ మోడల్‌ను ఫైనాన్స్‌పై కొనాలనుకుంటే కంపెనీ ఆ సౌకర్యాన్ని అందిస్తోంది. కనీసం రూ.50,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన రూ.6,50,000 ఏదైనా ఫైనాన్షియల్ బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకోవాలి.

35
ఎంత EMI కట్టాలి?

మీ సిబిల్ స్కోర్ బాగుంటే, తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఉదాహరణకు 9% వడ్డీ రేటుతో 5 ఏళ్ల (60 నెలలు) కాలానికి లోన్ తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.14,000 ఉంటుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన మొత్తం.

45
రెనాల్ట్ ట్రైబర్ ఇంజన్, మైలేజ్

ఈ సరసమైన MPVలో 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్‌పై 20 kmpl, ఆటోమేటిక్‌పై 18.2 kmpl మైలేజ్ ఇస్తుంది.

55
రెనాల్ట్ ట్రైబర్ సేఫ్టీ ఫీచర్లు

రెనాల్ట్ ట్రైబర్‌లో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories