టాటా సియెర్రా తన ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజన్, పోటీ ధరతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కారు ధర ఎతుంది..? డౌన్ పేమెంట్ ఎంత చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు..?
టాటా మోటార్స్ పాత తరం సియెర్రాను కొత్త హంగులతో మళ్లీ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. 1990 లలో తీసుకువచ్చిన ఆ ఐకానిక్ SUV అప్పుడెంత హల్ చల్ చేసిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. కొత్త టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
25
టాటా సియెర్రా ధర..?
టాటా సియెర్రా బేసిక్ మోడల్ కారు ధర రూ.11.49 లక్షలుగా ఉంది. అదే టాప్ వేరియంట్ ధర రూ.18.49 లక్షలుగా ఉంది. దేశంలోని వివిధ నగరాలు, షోరూంలను బట్టి ధర కాస్త అటుఇటుగా ఉండవచ్చు.
35
టాటా సియెర్రా ప్రత్యేకతలు
సియెర్రా కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు పవర్ 105 bhp, టార్క్ సామర్థ్యం 145 Nmగా ఉంటుంది.
టాటా సియెర్రా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వెర్షన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ వెర్షన్స్ అందుబాటులోకి రానుంది.
ఈ కారు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ SUV ఫీల్‌ను అందిస్తుంది. ఈ కారులో కూర్చుంటే లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. హైవేలపై లాంగ్ డ్రైవ్ కు ఇది ఉత్తమమైనది. దీని లుక్ కూడా అదిరిపోతుంది.
55
ఈ కార్లతో సియెర్రా పోటీ..
భారత మార్కెట్లో టాటా సియెర్రా.. క్రెటా, సెల్టోస్, డస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. ధర, మైలేజ్, బ్రాండ్ పరంగా ఈ కారు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది.
ఈ కారులో కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లు ఇస్తుంది. టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.