Top EV Scooter : కేవలం 21 నెలల్లో 4,75,144 స్కూటర్ల అమ్మకాలా..! ఈవి మార్కెట్లో ఈ కంపెనీయే తోపు..!

Published : Sep 30, 2026, 03:47 PM IST

Ather Electric Scooter: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ దూసుకుపోతోంది. ఏకంగా 8 లక్షల స్కూటర్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.

PREV
15
8 లక్షల మార్క్‌ను చేరిన ఏథర్ ఈవి అమ్మకాలు..

ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ జోరు కొనసాగుతోంది. తాజాగా ఈ కంపెనీ 8 లక్షల కస్టమర్ డెలివరీల మైలురాయిని దాటేసింది. ముఖ్యంగా గత 21 నెలల్లోనే కంపెనీ మొత్తం అమ్మకాల్లో 59 శాతం నమోదు కావడం విశేషం… దీన్ని బట్టి ఏథర్ స్కూటర్లకు డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏథర్ ఎనర్జీ 2018లో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాహన్ (Vahan) డేటా ప్రకారం… 2026 సెప్టెంబర్ 28 నాటికి ఏథర్ 8,00,822 ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. దీంతో ఇండియాలో 8 లక్షల రిటైల్ సేల్స్ మార్క్‌ను దాటిన నాలుగో ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థగా ఏథర్ నిలిచింది.

ఏథర్ కంటే ముందు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), టీవీఎస్ మోటార్ (TVS Motor), బజాజ్ ఆటో (Bajaj Auto) కంపెనీలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.

25
అసలు ఏథర్ స్పెషల్ ఏంటి?

తక్కువ సమయంలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను ఏథర్ ఎంత వేగంగా చేరుకుందనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఇది ఇండియాలో ఏథర్ ఈవి స్కూటర్లకు ఉన్న క్రేజ్ ను తెలియజేస్తుంది.

2025 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ 28 వరకు ఏథర్ ఏకంగా 4,75,144 స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. అంటే కంపెనీ ఇప్పటివరకు చేసిన మొత్తం రిటైల్ సేల్స్‌లో సుమారు 59 శాతం కేవలం గత 21 నెలల్లోనే జరిగాయి. ఇటీవల కాలంలో ఏథర్ స్కూటర్లకు డిమాండ్ ఎంత వేగంగా పెరిగిందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.

35
సేల్స్ పెంచేసిన రిజ్టా (Rizta)

ఏథర్ సాధించిన ఈ భారీ వృద్ధిలో రిజ్టా (Rizta) మోడల్ కీలక పాత్ర పోషించింది. ఫ్యామిలీ అవసరాల కోసం మార్కెట్లోకి వచ్చిన రిజ్టా, ఏథర్ సేల్స్‌ను అమాంతం పెంచేసింది. 2026 ఆగస్టు నెలలోనే ఏథర్ 29,694 స్కూటర్లను డీలర్లకు పంపగా, అందులో రిజ్టా వాటానే ఏకంగా 76 శాతం ఉంది. ఇక 450 సిరీస్ వాటా 23 శాతంగా నమోదైంది. దీంతో ఒకప్పుడు ప్రీమియం పెర్ఫార్మెన్స్ స్కూటర్ బ్రాండ్‌గా మాత్రమే గుర్తింపు ఉన్న ఏథర్, ఇప్పుడు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

 ఇప్పుడు కోనార్క్ (Konarc) వచ్చేసింది

ఏథర్ తదుపరి టార్గెట్ కోనార్క్ (Konarc) మోడల్‌పైనే ఉంది. 2026 ఆగస్టు 29న లాంచ్ అయిన కోనార్క్, ఏథర్ కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. దీన్ని తక్కువ ధర మోడల్‌గా కంపెనీ తీసుకొచ్చింది. బెంగళూరు ఎక్స్-షోరూమ్ ప్రకారం దీని ప్రారంభ వేరియంట్ల ధర రూ.99,999 నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంది. దీని ద్వారా ఏథర్ కేవలం ఈవీ యూజర్లనే కాకుండా, ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లు వాడుతున్న కస్టమర్లను కూడా ఎలక్ట్రిక్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది.

కోనార్క్ లాంచ్ అయిన మొదటి నెలలోనే 217 యూనిట్లను డీలర్లకు పంపారు. ఇది కొత్త మోడల్ కావడంతో రాబోయే నెలల్లో దీని సేల్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

45
ఒకే నెలలో 36,000కు పైగా సేల్స్..

ఏథర్ ప్రస్తుత వృద్ధికి దాని నెలవారీ సేల్స్ నంబర్లే మరో నిదర్శనం. 2026 మార్చి నెలలో ఏథర్ 36,633 స్కూటర్లను విక్రయించి తన ఆల్-టైమ్ హయ్యెస్ట్ మంత్లీ సేల్స్ రికార్డును నమోదు చేసింది. అంతేకాదు గత 12 నెలల్లో నాలుగు సార్లు 30,000కు పైగా నెలవారీ సేల్స్ సాధించింది.

2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఏకంగా 2,58,684 ఏథర్ స్కూటర్లు కస్టమర్లకు డెలివరీ అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో జరిగిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్‌లో ఏథర్ వాటా 16.67 శాతంగా ఉందని వాహన్ (Vahan) డేటా చెబుతోంది.

2026లో కొత్త సేల్స్ రికార్డ్?

2025 సంవత్సరం మొత్తంలో ఏథర్ 2,16,460 యూనిట్లను విక్రయించింది. కానీ 2026 సెప్టెంబర్ 28 నాటికే ఆ రికార్డును బ్రేక్ చేసి 2,58,684 యూనిట్లను అమ్మేసింది. దీన్ని బట్టి చూస్తే, 2026 క్యాలెండర్ ఇయర్‌లో ఏథర్ సుమారు 3.5 లక్షల స్కూటర్లను విక్రయించే దిశగా దూసుకుపోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

55
మొత్తానికి ఏథర్ సక్సెస్‌కు కారణం ఏంటి?

ఏథర్ ప్రస్తుత సేల్స్ స్పీడ్‌కు కేవలం ఒక్క కారణమే చెప్పలేం. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ 450 సిరీస్, ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన రిజ్టా, ఇప్పుడు బడ్జెట్ ధరలో వస్తున్న కోనార్క్.. వీటికి తోడు ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ ఏథర్ లైనప్‌ను మరింత బలోపేతం చేశాయి.

2018 నుంచి 2021 వరకు సేల్స్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ.. 2022లో 54,773 యూనిట్లు, 2023లో 1,11,812 యూనిట్లు, 2024లో 1,36,512 యూనిట్లతో వృద్ధి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక 2025లో ఏకంగా 2,16,460 యూనిట్లకు చేరుకుంది. అందుకే 8 లక్షల అమ్మకాలు అనేది ఏథర్‌కు కేవలం ఒక సేల్స్ మైలురాయి మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో కంపెనీ సేల్స్ స్పీడ్ ఎంత వేగంగా పెరిగిందో చెప్పేందుకు ఇదొక పక్కా ఉదాహరణ.

Read more Photos on
click me!

Recommended Stories