Best SUVs Under 8 Lakhs: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో రూ. 8 లక్షల లోపు బడ్జెట్‌లో 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం మైండ్ బ్లాకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.
8 లక్షల బడ్జెట్‌లో ఫ్యామిలీ ఎస్‌యూవీ కొనాలా? టాప్ 4 ఆప్షన్స్ ఇవే
మీ బడ్జెట్ దాదాపు 8 లక్షల రూపాయలు ఉందా? మీ చిన్న కుటుంబానికి ఒక సూపర్ ఎస్‌యూవీ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే ఇండియన్ మార్కెట్లో మీకు చాలా మైండ్ బ్లోయింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్న కార్లలో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, హ్యుందాయ్ వేన్యూ ముందు వరుసలో ఉన్నాయి.
అయితే ఈ నాలుగు కార్లు ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తుండటంతో, వీటిలో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది తేల్చడం కాస్త కష్టమే. అందుకే మీ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సరిపోయే కార్‌ను ఎంచుకోవడానికి వీలుగా.. ఈ నాలుగు పాపులర్ ఎస్‌యూవీల ధర, మైలేజ్, ఇంజిన్, సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్లను కంపేర్ చేసి అందిస్తున్నాం.
మారుతి సుజుకి బ్రెజ్జా ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది రోడ్డుపై చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ కారు ఇంటీరియర్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. కేబిన్‌లో మంచి లెగ్‌రూమ్ లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచుల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ వంటి కిరాక్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ ఫీచర్లు లభిస్తాయి. ఈ కారు లీటరుకు 17 నుండి 20 కిలోమీటర్ల వరకు ఈజీగా మైలేజ్ ఇస్తుంది. మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
36
టాటా నెక్సాన్: 5 స్టార్ సేఫ్టీ, అద్భుతమైన మైలేజ్
టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. సెక్యూరిటీ పరంగా నెక్సాన్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి.
కారు లోపల 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీని పెట్రోల్ మోడల్ లీటరుకు 17 నుండి 17.5 కిమీ మైలేజ్ ఇస్తే, డిజిల్ మోడల్ ఏకంగా 23 నుండి 24 కిమీ వరకు సూపర్ మైలేజ్‌ను అందిస్తుంది.
స్కోడా కైలాక్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇందులో 1.0 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 115 PS పవర్, 178 Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. లాంగ్ ఫ్యామిలీ ట్రిప్స్ వేసే వారికి ఇందులో 446 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ లభిస్తుంది.
ఈ కారులో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రోల్‌ఓవర్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ కారు సుమారు 18 నుండి 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని ఎంజాయ్ చేసే వారికి ఇది పర్ఫెక్ట్.
56
హ్యుందాయ్ వేన్యూ: అర్బన్ స్టైల్, అడ్వాన్స్డ్ ఏడీఏఎస్ టెక్నాలజీ
హ్యుందాయ్ వేన్యూ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. వేన్యూ కేబిన్ డిజైన్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. వెనుక సీట్లను రీక్లైన్ చేసుకునే వెసులుబాటు, యాంబియంట్ లైటింగ్ ఇందులో ఉన్నాయి.
ఇందులో 8 ఇంచుల టచ్‌స్క్రీన్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కామన్. ఇంజిన్ రకాన్ని బట్టి ఈ కారు లీటరుకు 17 నుండి 21 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునే వారికి ఇది గుడ్ ఛాయిస్.
66
మీ ఫ్యామిలీకి ఏ ఎస్‌యూవీ సరిపోతుంది?
ఏ విధమైన టెన్షన్ లేకుండా మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ కావాలనుకుంటే మార్కెట్లో మారుతి బ్రెజ్జా ఒక బెస్ట్ ఛాయిస్. అద్భుతమైన సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ, మంచి డిజైన్, డిజిల్ ఇంజిన్ కోరుకునే వారికి టాటా నెక్సాన్ సరైన కారు. సూపర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఎక్కువ బూట్ స్పేస్ ఇష్టపడే వారు స్కోడా కైలాక్ వైపు వెళ్ళవచ్చు. ఇక మోడ్రన్ డిజైన్, ఏడీఏఎస్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలనుకుంటే హ్యుందాయ్ వేన్యూ కచ్చితంగా పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది.