టాటా ఏరిస్‌లో ప్రయాణికుల రక్షణ కోసం పలు యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, హై-బీమ్ అలర్ట్, ఈఎస్‌పీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రోల్‌ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, బిల్ట్-ఇన్ డాష్‌క్యామ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా అందిస్తున్నారు.