ప్రేమను పొందే శీతాకాలం.. ఏ రాశివారు లవ్ లో పడబోతున్నారంటే..

First Published Dec 8, 2022, 11:50 AM IST

ఈ వింటర్ ఒంటరి వారికి గుర్తుండిపోయే శీతాకాలంగా మారబోతోంది. తాము ప్రేమించిన వ్యక్తులను కలుసుకోబోతున్నారు. 

శీతాకాలం అనగానే.. ప్రియుడు లేదా ప్రియురాలి వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయి.. చలికాచుకునే దృశ్యాలే కళ్లముందు మెదులుతాయి. జంటలకు ఓకే మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ శీతాకాలం సింగిల్స్ కు అదృష్టంగా మారబోతోంది. తమ ప్రియమైనవారిని కలుసుకోబోతున్నారు. ఏ రాశివారికి ఇలాంటి అదృష్టం ఉందో చూడండి మరి..

మేషం (Aries) : తమని తాముగా ఇష్టపడే వ్యక్తిని భాగస్వామిగా పొందుతారు. ఇది కూడా విచిత్రంగా ఈ సీజన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరినైనా, ఎప్పుడైనా కలుసుకోవచ్చు. మీరు వారితో కలిసి పోవడానికి, మీ మనసులు కలవడానికి ఇదే మంచి సమయం.

Astro

వృషభం (Taurus) : వృషభరాశి వారికి శీతాకాలం అంటే చాలా ఇష్టం. వీరికి శీతాకాలం బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలోనే వీరి ప్రియమైనవారు వీరికి దొరుకుతారు. దగ్గరవుతారు. వీరి ఆలోచనలు, మనసు కూడా ఈ కాలంలో పాజిటివ్ గా ఉంటాయి. ఈ ఆశావాద దృక్పథమే వారికి వారి సరైన భాగస్వామిని అందిస్తుంది.

సింహరాశి (Leo) : శీతాకాలం సింహరాశి వారి కోరికలను నిజం చేస్తుంది కాబట్టి ఈ చలికాలం సింహరాశి వారు నిజంగా సంతోషంగా ఉంటారు. తమను గాఢంగా ప్రేమించే, పట్టించుకునే భాగస్వామితో ఉండాలనే వారి కల చివరకు నిజమవుతుంది. సింహరాశి వారు వారికి కాబోయే భాగస్వామిని అనుకోకుండా, విచిత్రమైన పరిస్థితిలో కలుసుకుంటారు. 

తులారాశి (Libra) : తులారాశివారు తాము పనిచేసే చోట్లనే ప్రేమకోసం వెతుక్కుంటుంటారు. అలా కాకుండా కాస్త బ్రాడర్ గా ఆలోచిస్తే వీరి ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి ప్లేస్ లలో తమకు తెలియకుండానే తమ ప్రేమకు అడ్డంకులు ఏర్పడవచ్చు. అందుకే తులారాశి వారు ఈ సమయంలో ప్రేమకోసం అన్వేషించడం బాగా కలిసివస్తుంది. 

వృశ్చిక రాశి (Scorpio) : వీరు తమంతట తాము ఎవరికోసమూ వెతకరు. కానీ తమ ఆత్మబంధువును ఈ శీతాకాలంలో కలుసుకుంటారు. వృశ్చిక రాశి వారు వారిని గుర్తించలేకపోవచ్చు కానీ వారి నిజమైన ప్రేమ ఎట్టకేలకు  వారికి దక్కుతుంది. 

ఇక ఈ శీతాకాలం నులివెచ్చని ప్రేమికుల కౌగిలిని పొందలేని రాశులు కూడా ఉన్నాయి. అవి.. జెమిని, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.. ఈ రాశుల వారికి ప్రేమ దొరకదు. వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యక్తిని కలుసుకోవడానికి మరికొంత కాలం  ఓపికగా, వేచి ఉండటమే వారి పని. 

click me!