2023లో వృశ్చిక రాశివారి ఫలితాలు..!

First Published | Dec 8, 2022, 11:01 AM IST

నూతన సంవత్సరం 2023లో వృశ్చిక రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఓ నెలలో ఈ రాశివారికి  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):


2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా  అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును.  ఆర్థిక, ఆరోగ్యపరిస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. గృహ సంబంధ విషయాలు, వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. నూతన పరిచయాలు లాభం కలిగించును.చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారలయందు కష్టపడిన ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘము నందు నీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.  

scorpions

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
 
ఈ నెలలో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  గతంలో జీవితభాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుంచి కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. లౌక్యంగా ప్రతిఘటించి, వాస్తవాలు నిరూపించి  మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. 
 
 లవ్ లైఫ్ : మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు.  మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. మీ భాగస్వామి తరుపు బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి.  

ఉద్యోగం-వ్యాపారం:  మీ వృత్తి జీవితంపై  సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే సాగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి.
 
 ఆరోగ్యం:    ఆరోగ్య విషయంలో  కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు కానీ హృద్రోగులు చర్మ వ్యాధులు వున్నవారు చిన్నచిన్న చికాకులు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలు,  వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయట పెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. 

Scorpio Zodiac

ఫిబ్రవరి 2023

ఈ నెలలో మహిళల వల్ల ప్రయోజనం పొందుతారు.   సహోదర వర్గానికి అండగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకు సహాయం చేస్తారు. బాధ్యత అంతా మీపై వేసుకుంటారు. శుభకార్యాలకు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబం, బంధువులతో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సహోదర వర్గానికి అండగా ఉంటారు.


ఉద్యోగం-వ్యాపారం:   వ్యాపారస్దులు ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు.వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి.  ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. 

లవ్ లైఫ్:     దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతంమిమ్మల్ని అర్దం చేసుకుంటారు. కుటుంబ విషయంలో వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి.   పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. వివాదాలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు. లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేయండి. 
  
 ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెల లో ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్‌, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. 

ఆరోగ్యం:  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగున్నా  స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.  వ్యయ ప్రయాసలు తప్పవు.   కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుని మనోల్లాసాన్ని పొందుతారు.  

మార్చి 2023

ఈ రాశివారికి   శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.ప్రతి విషయంలోనూ సహోదరసహోదరీ వర్గం, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కనపెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. ప్రతిష్ఠాత్మక సంస్థలలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి.  ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. 

లవ్ లైఫ్ :  జీవిత భాగస్వామితో కొన్నిసార్లు అహంకారానికి సంబంధించిన విభేదాలు ఎదుర్కోవలసి రావచ్చు. మీ లక్ష్యాలను సాధించడంలో ఆలస్యం ఉండవచ్చు. మీ కుటుంబం లో మీరంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరి క్షణంలో ఆ స్థాన చలనం ఆగిపోతుంది.

ఉద్యోగం-వ్యాపారం:  పాత బకాయిలు, బాధ్యతలను సెటిల్ చేయడానికి కూడా ఇది అనుకూలమైన కాలం. అయితే వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.దొంగలెక్కలు చెప్పేవారు అధికమవుతారు. అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.  వ్యాపారస్దులు ఎదుగుదలకు సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞానం ఉపకరిస్తుంది.

ఆరోగ్యం: మీ  తల్లి ఆరోగ్యం అలాగే ఉంటుంది. ఆమెతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ తోబుట్టువులు సాయింతో అనారోగ్య సమస్యలు దాటుతారు.వారితో మీ సంబంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబం ఎక్కువ సమయాన్ని గడుపుతారు. 

Scorpio

ఏప్రియల్  2023

ఈ నెల ఆశాజనకంగానే ఉంది. ఇంట్లో ప్రోత్సాహం బాగానే చిన్న చిన్న చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. కంబైండ్‌ స్టడీస్‌ వల్ల నష్టపోతామని గ్రహించి విద్యార్థులు జాగ్రత్తపడతారు. బంధువులు, పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి పత్రాలు అస్పష్టంగా ఉంటాయి. మధ్యవర్తిత్వం చేసి వ్యవహారం కొలిక్కి తీసుకువస్తారు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది.విందులు, వినోదాలు, శుభాకార్యాలలో అవమానాలను ఎదుర్కొంటారు.
 
లవ్ లైఫ్ : జీవన భాగస్వామి  తో ఆచితూచి మాట్లాడాలి. కొన్ని విషయాలు చికాకు కలిగిస్తాయి. ఇకపై అలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి.  ఫలితంగా మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.

ఉద్యోగం-వ్యాపారం:  భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది.   స్నేహితులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించి లాభపడతారు. భవిష్యత్తు కార్యక్రమాల గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది.  
 
ఆరోగ్యం:  ఈ నెల మధ్యలో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఖర్చులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంచుకుంటే కొన్ని టెన్షన్స్ తగ్గుతాయి. ఓ శుభవార్త మిమ్మల్ని  ధైర్యంగా ముందుకు తీసుకెళ్తుంది.  
 

మే  2023

ఈ నెల  అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. సాంకేతిక, వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం అభిమానంగా మారి సహాయపడతారు. ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు. కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలవారి కృషికి తగిన గుర్తింపు, గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. 

లవ్ లైఫ్ :   నమ్మకద్రోహాన్ని, కృతఘ్నతను భరించలేరు.  నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు,  చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు.ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం.   

ఉద్యోగం-వ్యాపారం:    ఆత్మవిశ్వాసం, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు, మిత్రులు కావటం వల్ల కొంత మనఃశాంతి లభిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది.

ఆరోగ్యం:   ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధువులు, కుటుంబ విషయాలు వృత్తి-ఉద్యోగ, వ్యాపారాల మీద ముఖ్యంగా ఆరోగ్యంపై పడుతుంది. కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు.  శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం వలన శనైశ్చరుని అనుగ్రహం లభిస్తుంది. 

scorpions


జూన్   2023
 
ఈ నెలలో   ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్స్‌, సేల్స్‌ సంవత్సర ప్రారంభంలో ఎక్కువ ఆసక్తి కలుగజేస్తాయి. మనస్సు ఎంత వద్దనుకున్నా ఆ మార్గాల వైపు లాగుతుంది. వ్యాపారంలో రొటేషన్‌, లాభాలు బాగుంటాయి. 

లవ్ లైఫ్ :   మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది. విందులు, వినోదాలు, శుభాకార్యాలలో అవమానాలను ఎదుర్కొంటారు. సహోదర వర్గం వివాహాలు చికాకు కలిగిస్తాయి.

ఉద్యోగం-వ్యాపారం:  మీరు ఆత్మవిశ్వాసంతో, ప్రేరణతో ఉంటారు. ఇది మీ వృత్తిలో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. మీరు కార్యాలయంలో మీ ఉన్నతాధికారులను మెప్పించగలరు. మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అతని సలహా మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి సరైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఈ నెల పూర్తిగా అనుకూలం.

ఆరోగ్యం: ఈ నెలలో  కళ్లు, పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి  దగ్గర అవుతారు. మీరు ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత లలో మీరు ఏదో ఒక దానిని నిర్ధారించుకోవాలి.  
 

జూలై   2023

ఈ నెలలో  చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషం. 

లవ్ లైఫ్ : మీ జీవిత భాగస్వామితో జీవితం  చక్కగా ఉంది.  మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ ఇద్దరి మధ్య సఖ్యత లోపం ఉన్నా కొద్దిపాటి సహనం, తెలివితో పరిష్కారం చేసుకుంటారు. ఉద్యోగ ఒత్తిడి కుటుంబంపై పడనీయకండి. శుభకార్యాలకు తరుచు హాజరవ్వండి.

ఉద్యోగం- వ్యాపారం:   ఏ రకమైన వ్యాపారం అయినా గణనీయమైన లాభాలను పొందవచ్చు. ఇది వ్యక్తిగత జీవితానికి కూడా మంచి సమయం అవుతుంది. మీరు మీ సంబంధాలలో ఆనందం, సంతృప్తిని అనుభవిస్తారు. మీ జీవితంలో రాణించడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుండి అవసరమైన అన్ని మద్దతులను పొందుతారు. అలాగే మీ కమ్యూనికేషన్, మోటివేషనల్ స్కిల్స్ మీకు విజయం సాధించడంలో సహాయపడతాయి.

 ఆరోగ్యం:    ఈ నెల మీకు ఒత్తిడి, ఆందోళన అనేవి ఉంటాయి. . రక్తం, చక్కెర పరిమాణానికి సంబంధించిన రెగ్యులర్ చెక్-అప్ లను చేసుకోవడం మంచిది.అయితే మీ సాధారణ ఆరోగ్యానికి,పనులకు అంతరాయం కలగదు.  మీ ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మీరు నిరంతరం ఇతర మార్గాలను వెతుకుతూ ఉంటారు. 
 

ఆగస్ట్    2023

 ఈ నెల   సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే సాగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. 

 లవ్ లైఫ్ :  మీ కుటుంబంలో  సహోదర వర్గం వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.  

ఆరోగ్యం:   పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. దాంతో సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.  పరిష్కార సాధనకు  ఓర్పు, పట్టుదలతో శ్రమించాలి. పనిభారం, విశ్రాంతి లోపం. అయినా మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 

ఉద్యోగం- వ్యాపారం:    భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించి లాభపడతారు. భవిష్యత్తు కార్యక్రమాల గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది. 
 

Scorpio


సెప్టెంబర్    2023

ఈ నెలలో  ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహాయోగం అనుకూలమవుతాయి. శుభకార్య సంబంధ విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. 

లవ్ లైఫ్ :  పిల్లలు, జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు మీరు ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటారు.భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. సాంసారిక జీవితం ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను అందిస్తుందీ ఈ నెల.

ఉద్యోగం- వ్యాపారం: వ్యాపారులు లాభదాయకమైన కాలాన్ని అనుభవిస్తారు. వ్యాపారపరంగా మీరు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇదివరకు మీరు పెట్టిన పెట్టుబడి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఉద్యోగస్దులు కార్యాలయంలో కొన్ని అనవసరమైన అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఖర్చులు పెరగవచ్చు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. 

ఆరోగ్యం:   మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాసం మధ్యలో గ్రహాల అనుకూల కదలిక  వారి ఆరోగ్యంలో  పురోగతికి వివిధ అవకాశాలను ఇస్తుంది. గమనించి ముందుకు వెళ్లండి. మీ ఆరోగ్యంలో ఏ విధమైన సమస్యలూ గోచరించటం లేదు.

Representative Image: Scorpio

అక్టోబర్    2023

ఈ నెలలో  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధ, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలని యోచిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఖర్చులు వాటాలను దాదాపు మించిపోతాయి.
 
లవ్ లైఫ్ :   . మీ భాగస్వామి  తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. దాంతో కుటుంబ జీవనంలో కొన్ని సమస్యలు ఎదురైనా పరిష్కరించుకునే నేర్పు  వస్తుంది.  ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం.  తొందరపడకండి..అన్నీ సానుకూలం అవ్వుతాయి.  కుటుంబంలో  జరిగే వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. 

ఉద్యోగం- వ్యాపారం:   వృత్తి పర సమస్యలను మీ అంతట మీరు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు.  పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు శ్రమానంతరం లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఏర్పడి పరీక్షాకాలంగా ఉంటుంది.  మీ సహోద్యోగులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది మీ కార్యాలయంలో ఉత్పాదకత, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ఆరోగ్యం:   ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ద వహించాలి. మిమ్మల్ని మీరు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది. చిన్న చిన్న చిట్కాలతో సమిసి పోయే వాటిని పెద్దవి చేసుకోవద్దు. అప్రమత్తతే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నవంబర్    2023

ఈ నెలలో  అదనపు బాధ్యతలు తప్పవు. సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు. అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు జమ చేసుకుంటారు. బంధువర్గం ప్రతికూలంగా మాట్లాడతారు. ఎదురించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బాధను దిగమింగుకుంటారు. అనుకున్నది సాధిస్తారు.

లవ్ లైఫ్ : జీవన భాగస్వామితో విభేదాలు ఉన్నాయి. వాటిని పెంచుకోకండి. చిన్న చిన్నవే పెద్ద సమస్యలుగా మారుతాయి. గ్రహాలు అనుకూలం లేనప్పుడు చాలా వాటికి మౌనంగా ఉండటం మేలు. పిల్లలు సైతం మిమ్మల్ని విసిగించినా పట్టించుకోవద్దు.

ఆరోగ్యం:    చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యాధి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. అయితే  మీ లక్ష్యాలను సాధించడంలో జరిగే ఆలస్యం మీ ఆరోగ్య జీవితంపై పడవచ్చు. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం మంచిది. 
  
ఉద్యోగం- వ్యాపారం:    ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు.  మనశ్శాంతి  కరువు. ఒత్తిడి, పనిభారం. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంట దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర నిరుత్సాహం కలిగిస్తుంది.  తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 

డిసెంబర్    2023

ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధ విషయాలు సానుకూలపడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. వేరేవిధంగా అభివృద్ధి చేస్తారు.  ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్ధపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, ట్రావెల్స్‌, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

లవ్ లైఫ్ :  కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి.  న్యాయబద్దమైన కోరికలను వారు ఆమోదిస్తారు. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. 

ఆరోగ్యం: మీరు ఉదరానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను  ఎదుర్కోవచ్చు. అయితే అతి కొద్ది సమయాల్లో అన్నీ సర్దుకుంటాయి. కొత్త జీవిన శైలికి అలవాటు పడతారు.

ఉద్యోగం- వ్యాపారం : ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు.

Latest Videos

click me!