ఈ రాశులవాళ్లు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త...

First Published Dec 8, 2022, 9:58 AM IST

మీ రాశిచక్రం ప్రకారం.. మీ బలాలు, బలహీనత, మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం గురించి చెప్పొచ్చంటున్నారు జ్యోతిష్యులు. అయితే మీ రాశిప్రకారం.. మీరు కొన్ని లక్షణాలను ఎదుర్కొంటే వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలని అర్థం. ప్రతిరాశి చక్రం వారు ఎక్కువగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మేషరాశి : తలనొప్పి (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషరాశి వారి తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది. దీనివల్ల వీరు తరచుగా తలనొప్పితో ఇబ్బందిపడతారు. అయితే మీ భావోద్వేగాలను నియంత్రించడం వల్ల తలనొప్పి మరింత ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. లేదా పూర్తిగా తగ్గించుకోవచ్చు.

వృషభరాశి (ఏప్రిల్ 20 - మే 20): గొంతు ఇన్ఫెక్షన్

వృషభ రాశివారు ఎప్పుడూ జింజెర్ క్యాండీలను పీల్చడం లేదా ఓదార్పునిచ్చే టీ లను ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే వీరికి చాలా సున్నితమైన గొంతు ఉంటుంది. కానీ ఇవి చాలా తొందరగా అంటువ్యాధులకు గురవుతాయి.

మిథున రాశి (మే 21 - జూన్ 20): శ్వాసకోశ సమస్యలు

మిధున రాశి వారు తినే ఆహారం వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇది వారిని త్వరగా అలసిపోయేలా చేస్తుంది. అలాగే వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల ఈ రాశివారు విపరీతమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 
 

కర్కాటకం (జూన్ 21 - జూలై 22): జీర్ణ సమస్యలు

ఈ రాశివారు తరచుగా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా. అందుకే ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడతారు. అలాగే గట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

సింహరాశి (జూలై 23 - ఆగస్టు 22): మానసిక ఆరోగ్య సమస్యలు

సింహ రాశి వారు నిర్భయంగా ఉంటారు. ముఖ్యంగా వీరు గొప్ప హృదయం కలిగి ఉంటారు. అయినప్పటికీ ఎక్కువ ప్రేమ, సంరక్షణతో వారి సున్నితమైన మనసు గాయపడుతుంది. అలాగే హృదయవిదారకంగా ఉంటారు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా ప్రశాంతతను తిరిగి పొందొచ్చు. 
 

కన్యారాశి (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22): పుండ్లు

కన్య రాశివారు శక్తిస్థాయిలను మించి పనిచేస్తారు. దీనివల్ల వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. విశ్రాంతి లేకపోవడం వల్ల వారి పేగుల్లో మంటపుడుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది అల్సర్లకు కూడా దారితీస్తుంది.

తులారాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22): మూత్రాశయ సమస్యలు

పోషకాహారం, మీరు తినే ప్రతీది మీ మూత్రపిండాలు లేదా మూత్రాశయానికి ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే ఈ భాగాల్లో ఇబ్బంది అయినా.. ఏవైనా లక్షణాలు కనిపించినా వెంటనే హాస్పటల్ కు వెల్లండి. 
 

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 - నవంబర్ 21): డీహైడ్రేషన్

ఈ రాశి  వారు రోజంతా పుష్కలంగా నీటిని, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను తాగేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ రాశివారు ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. నీటిని తాగితే వారు ఆరోగ్యంగా ఉంటాయి. హైడ్రేట్ గా ఉంటారు. 

ధనుస్సు రాశి (నవంబర్ 22 - డిసెంబర్ 21): వెన్ను నొప్పి

ఈ రాశి వారికి ఎక్కువసేపు కూర్చోవడం లేదా అస్సలు కూర్చోకపోవడం వంటి అలవాటు ఉండొచ్చు.  ఈ అసమతుల్యత వల్ల వ్యాయామం లేకపోవడం, ఒంటి నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
 

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 19): మోకాలి సమస్యలు

మకర రాశి వారు ఉదయం సూర్యరశ్మిలో ఎక్కువ సేపు గడిపేలా చూసుకోవాలి. అప్పుడే వారి ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి మోకాలి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 
 

కుంభరాశి (జనవరి 20 - ఫిబ్రవరి 18): చేతులు, కాలికి గాయాలు

వెయిట్ ట్రైనింగ్ లేదా ఇంట్లో భారీ వస్తువులను ఎత్తడం వంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కుంభ రాశి వారి చేయి లేదా కాలుకు గాయాలయ్యే అవకాశం ఉంది. మీ గాయం, రకాన్ని బట్టి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.  గాయం నొప్పి ఎక్కువగా ఉంటే తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలి. 
 

మీనరాశి (ఫిబ్రవరి 19 - మార్చి 20): జలుబు, ఫ్లూ

మీనరాశి వారికి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. దీంతో వీళ్లు తరచుగా, సులభంగా అంటువ్యాధుల బారిన పడుతుంటారు. అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ అంటువ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. 
 

click me!