
శని దేవుడు జ్యోతిష్యంలో ముఖ్యమైన గ్రహంగా చెప్పుకుంటారు. ఆయన న్యాయం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఓర్పు, కర్మ దేవుడిగా పిలుచుకుంటున్నారు. శని దేవుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. కొన్ని రాశులపై శని ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కథనంలో శని దేవుడు ఏ రాశులలో శక్తివంతంగా ఉంటాడు.
శని దేవుడు మకరం, కుంభ రాశుల అధిపతి. ఈ రెండు రాశులు శనికి స్వక్షేత్రాలు. అందువల్ల, ఈ రాశులలో శని చాలా శక్తివంతంగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా, శని తులారాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు, అంటే ఆ రాశిలో అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, శని మేషరాశిలో నీచస్థితిలో ఉంటాడు. అంటే అక్కడ అతని శక్తి బలహీనంగా ఉంటుంది. శని దేవుడికి ఇష్టమైన రాశులు ఇవిగో.
1. మకరం
మకర రాశిలో శని చాలా బలంగా ఉంటాడు. ఈ రాశుల వారు కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి శని ఆశీస్సులు పొందుతారు. శని ప్రభావం మకర రాశుల వారిపై బాగా పడుతుంది. వీరికి బాధ్యత, నాయకత్వం, జీవితంలో బలమైన పునాదిని నిర్మించడంలో సహాయపడుతుంది.
2. కుంభం
కుంభ రాశి వారు శని ఆధిపత్యంలో కలిగిన రాశి ఇది. ఈ రాశుల వారు సామాజిక సంస్కరణలు, వినూత్న ఆలోచనలు, మానవతా దృక్పథాలకు శని మద్దతు లభిస్తుంది. కుంభ రాశులకు శని సామాజిక న్యాయం, సమిష్టి ప్రయత్నాలలో విజయాన్ని ఇస్తాడు. వీరు శని సంచార సమయంలో వారి ప్రత్యేకమైన కృషి ద్వారా గుర్తింపు పొందుతారు.
3. తుల
తులా రాశిలో శని ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల, ఈ రాశుల వారిపై శని ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. తుల రాశుల వారికి న్యాయం, ధర్మం, సంబంధాలలో సమతుల్యత, వృత్తిపరమైన విజయాలను సాధించడానికి శని ఆశీస్సులు పొందుతారు. ఉదాహరణకు, శని తుల సంచార సమయంలో, వీరు వారి వృత్తి, వ్యక్తిగత జీవితంలో స్థిరమైన వృద్ధిని సాధిస్తారు.
కొన్ని రాశుల వారిపై శని తటస్థ ప్రభావాన్ని చూపుతాడు. ఇవి శనికి ఇష్టమైనవి లేదా ఇష్టం లేనివి అని చెప్పలేం.
1. వృశ్చికం
వృశ్చిక రాశి వారకి శని లోతైన మార్పులను, అంతర్గత వృద్ధిని ఇస్తాడు. వీరు శని ప్రభావం వల్ల కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఓపికగా ఉంటే గొప్ప విజయాలు సాధించగలరు.
2. మీనం
మీన రాశి వారికి శని ఆధ్యాత్మిక వృద్ధిని, బాధ్యతను ప్రోత్సహిస్తాడు. వీరు శని సంచార సమయంలో వారి భావోద్వేగాలను నియంత్రించుకొని, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం నేర్చుకుంటారు.
3. ధనుస్సు
ధనుస్సు రాశి వారికి శని విద్య, ప్రయాణం, తాత్విక ఆలోచనలలో క్రమశిక్షణ నేర్పుతాడు. వీరు శని పాఠాలను అంగీకరిస్తే, దీర్ఘకాలిక విజయాలు సాధిస్తారు.
శని దేవుడికి ఇష్టం లేని రాశులు అని జ్యోతిష్యంలో నేరుగా చెప్పకపోయినా కొన్ని రాశులలో అతని ప్రభావం తీవ్రంగా కష్టంగా ఉంటుంది.
1. మేషం
మేష రాశిలో శని నీచస్థితిలో ఉండటం వల్ల, ఈ రాశి వారికి శని ప్రభావం అడ్డంకులు, ఆలస్యాలు, ఓర్పును పరీక్షించే పరిస్థితులను సృష్టిస్తుంది. మేష రాశి వారికి శని సంచార సమయంలో కోపాన్ని నియంత్రించుకొని, కష్టపడి పనిచేయాలి.
2. కర్కాటకం
కర్కాటక రాశి వారికి శని భావోద్వేగపరమైన కష్టాలను, కుటుంబం, భద్రతకు సంబంధించిన సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. వీరు శని పాఠాలను ఓపికగా నేర్చుకుంటే, అంతర్గత బలాన్ని పొందుతారు.
3. సింహం
సింహ రాశి వారికి శని వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వాన్ని పరీక్షించవచ్చు. శని ప్రభావం వారిని వినయంగా, క్రమశిక్షణతో ఉండటం నేర్పుతుంది.