Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అక్టోబర్‌లో బుధుడు రెండు సార్లు తన గమనాన్ని మార్చబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి కలిసిరానుంది.
అక్టోబర్ 2న బుధుడు ఉదయించి అక్టోబర్ 3న తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. తుల రాశి వారికి ఇది అత్యంత శుభప్రదంగా ఉంటుంది. బుధుడి లగ్న ఇంట్లోకి ప్రవేశం వలన చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట లభిస్తుంది. దంపతుల జీవితం సుఖంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ మాటలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు. జీవిత భాగస్వామి కూడా కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం ఉంది.
25
వృశ్చిక రాశి – ఆర్థిక స్థిరత్వం, లాభాల ప్రవాహం
బుధుడి సంచారం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గతంతో పోలిస్తే సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ముఖ్యమైన లక్ష్యాలు సులభంగా నెరవేరతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఇది ప్రగతి, విజయాలతో నిండిన సమయమవుతుంది.
35
సింహ రాశి – ఆత్మవిశ్వాసం పెరుగుదల, కుటుంబ మద్దతు
బుధ సంచారం సింహ రాశి వారికి ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుంది. మీతోబుట్టువుల మద్దతు లభిస్తుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకుంటే లాభం పొందుతారు. సమాజంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభ సమయంగా చెప్పొచ్చు. విదేశీ సంబంధాల వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.
బుధుడిని వ్యాపార గ్రహంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సంచారం వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది. తుల, వృశ్చిక, సింహ రాశి వారికి ఈ కాలంలో.. వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్, కొత్త ఆఫర్లు రావచ్చు. పెట్టుబడులు లాభసాటిగా మారతాయి.
55
అదృష్టాన్ని తీసుకురానున్న అక్టోబర్
అక్టోబర్ 2025లో జరగబోయే బుధ సంచారం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. తుల రాశి వారికి గౌరవం, కుటుంబ సంతోషం లభిస్తే, వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలు, పెట్టుబడుల్లో విజయాలు వస్తాయి. సింహ రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కెరీర్, విద్యలో కొత్త విజయాలను సాధిస్తారు.