Zodiac signs: మేషరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల కష్టాలన్నీ తీరినట్లే!

Published : Apr 09, 2025, 10:00 AM IST

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు, నక్షత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వాటి కదలికలు, మార్పులు, కలయికలు మానవ జీవితాలపై మంచి, చెడు ప్రభావాలు చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పటికీ చాలామంది వీటిని నమ్ముతారు. అనుసరిస్తారు కూడా. కొందరైతే ముందుగానే తెలుసుకొని వాటికి పరిహారాలు కూడా చేస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం త్వరలో మేషరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల 4 రాశులవారికి మంచి రోజులు మొదలు కానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది! మరి ఆ అదృష్ట రాశులెంటో ఓసారి చూసేద్దామా!

PREV
15
Zodiac signs: మేషరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల కష్టాలన్నీ తీరినట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. బుధుడు మే 7న మేషరాశిలోకి ప్రవేశించి మే 23 వరకు అక్కడే ఉంటాడు. సూర్యుడు, బుధుడి కలయిక వల్ల 4 రాశుల వారి కష్టాలు తీరనున్నాయి. వారి జీవితంలో సంతోషం వస్తుంది. మరి ఆ రాశులెంటో చూసేద్దామా?

25
మిథున రాశి

మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి సంబంధాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి.

35
సింహ రాశి

సింహరాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి ఫలితాన్నిస్తుంది. ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. దేశ విదేశాల్లో పర్యటనకు వెళ్లొచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కెరీర్‌లో ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు.

45
మేష రాశి

మేషరాశి వారికి బుధాదిత్య రాజయోగం శుభప్రదం. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి.

55
మీన రాశి

మీన రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు బహుమతి కూడా పొందవచ్చు. వ్యాపారులు తమకు రావాల్సిన డబ్బును తిరిగి పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories