సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితం పెళ్లికి ముందు ఒకలాగా.. తర్వాత ఒకలాగా ఉంటుంది. పెళ్లి కొందరికి సంతోషాలను తెస్తే.. మరికొందరికీ కష్టాలను తీసుకురావచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుందట. డబ్బు సంపాదనతో పాటు, జీవితం సంతోషంగా ఉంటుందట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ అదృష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. దీని సహాయంతో ప్రతి ఒక్కరూ జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి తర్వాత విజయం వరిస్తుందట. వారు డబ్బు సంపాదించడంతో పాటు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత కలిసివస్తుందో ఇక్కడ చూద్దాం.
24
ఏ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి కలిసివస్తుంది?
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలోనైనా 1, 2, 3, 5, 12, 15, 20, 21, 23, 27, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు పెళ్లి తర్వాత బాగా కలిసివస్తుందట. వారు భర్తకు కూడా మంచి జీవితాన్ని ఇస్తారట. కుటుంబాన్ని బాగా చూసుకుంటారట. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత బాగా డబ్బులు సంపాదిస్తారట. విజయం ఎప్పుడూ వీరి వెంటే ఉంటుందట.
34
ఈ తేదీల్లో పుట్టిన వారికి..
ఏ నెలలోనైనా 4, 6, 8, 11, 22, 24, 29 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమలో సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వారికి అత్తతో సంబంధాలు కూడా అంతగా బాగుండవట.
44
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికి భయపడరు!
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 4, 8, 10, 17, 27, 31 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు. దేనికైనా ధైర్యంగా ముందడగు వేస్తారు. వచ్చిన అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు.