ఈ రాశులవారికి రెండో పెళ్లి తప్పదా?

First Published | Nov 20, 2024, 4:37 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం  కొన్ని రాశులవారికి రెండో పెళ్లి జాతకంలో రాసి ఉంటుందట. మరి,  ఏ రాశులకు రెండో పెళ్లి జరిగే అవకాశం ఉంటుందో చూద్దాం...

వృషభ రాశి..

వృషభ రాశి వారి జాతకంలో  రెండో పెళ్లి అవకాశం చాలా ఎక్కువగా ఉందట.  సాధారణంగా వృషభ రాశివారు సంబంధాలలో స్థిరత్వం, భద్రతను ఇష్టపడతారు. మొదటి పెళ్లిలో వారి అంచనాలు అందుకోకపోతే.. రెండో పెళ్లి చేసుకునే ఆలోచన వస్తుందట. ఫస్ట్ మ్యారేజ్ హ్యాపీగా లేదు అనిపిస్తే.. రెండో మ్యారేజ్ వైపు అడుగులు వేస్తారు.

తుల రాశి

తుల రాశివారు జీవితంలో సామరస్యం, సమతుల్యతను కోరుకుంటారు. ముఖ్యంగా వైవాహిక బంధంలో వీరు సమతుల్యతను కోరుకుంటారు. వారు కోరుకున్న జీవితం ఫస్ట్ మ్యారేజ్ లో రాకపోతే... వీరు సెకండ్ మ్యారేజ్ వైపు అడుగులు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు తీవ్రమైన భావోద్వేగాలకు, ఉత్సాహానికి మారు పేరు. మొదటి పెళ్లిలో గుర్తింపు దొరకకపోతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఫస్ట్ మ్యారేజ్ లో ఎలాంటి అసంతృప్తి ఉన్నా.. వీరు రెండో పెళ్లి వైపు గా అడుగులు వేస్తారు.

ధనస్సు రాశి

ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ఇష్టపడతారు, సాంప్రదాయ పెళ్లిళ్లు వారికి నచ్చవు. మొదటి పెళ్లిలో ఇబ్బందిగా ఉంటే, స్వేచ్ఛనిచ్చే ఇంకో పెళ్లి కోసం చూస్తారు.

ఈ జ్యోతిష్య లేఖనంలోని సమాచారం జ్యోతిష్యులు, పంచాంగం, ధార్మిక గ్రంథాలు, నమ్మకాల మీద ఆధారపడింది. ఇది కేవలం మీకు సమాచారం అందించడం కోసమే. దీన్ని కేవలం సమాచారంగానే తీసుకోండి.

Latest Videos

click me!