1.వృషభ రాశి…
వృషభ రాశివారికి అదృష్టం కలగనుంది. 2025లో ఈ రాశివారికి మాళవ్య రాజయోగం కలగనుంది. ఇది ఈ రాశివారికి చాలా అనుకూలం కానుంది. ఎందుకంటే ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు. అందుకే.. ఈ రాశివారికి ఈ ఏడాది ఆదాయం పెరుగుతుంది. ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభాలు కలుగుతాయి. కాబట్టి.. రెట్టింపు ఆదాయం అందుకుంటారు.
అంతేకాదు, ఈ కాలంలో వీరు ఏదైనా ఆస్తి, లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నా మంచే జరుగుతుంది. మీకు అదృష్టం మరింత అనుకూలంగా ఉంటే ఉద్యోగ, వ్యాపారాల్లోనూ పురోగతి పొందుతారు. పెట్టుబడులు ప్రయోజనకరంగా మారతాయి. సంతానం లేని వారికి ఆ భాగ్యం కూడా కలగనుంది. పిల్లలు ఉన్నవారికి వారి ప్యూచర్ అద్భుతంగా మారనుంది.