1.మేష రాశి..
మేష రాశికి చెందిన అమ్మాయిలు పెళ్లి విషయంలో చాలా అదృష్టవంతులు. నార్మల్ గానే ఈ రాశి అమ్మాయిలు.. తమకు నచ్చిన వ్యక్తిని, తమను అన్ని విధాలుగా ప్రేమించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. వారు కోరుకున్న భర్తే దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ రాశి అమ్మాయిలు తమ భర్తను అమితంగా ప్రేమిస్తారు. వారు చూపించే ప్రేమకు భర్తలు కూడా కరిగిపోతారు. నెమ్మదిగా వారు ప్రేమ కురిపించి, తర్వాత.. భర్తను తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఈ రాశి అమ్మాయిలు ఏం చెబితే... భర్త ఆ మాట కచ్చితంగా వింటారు.