Zodiac signs: ఈ రాశులవారు ఇతరుల ముందు తల వంచరు.. ఆత్మ గౌరవం చాలా ఎక్కువ..!

Published : Sep 10, 2025, 03:39 PM IST

కొన్ని రాశులకు చెందిన వారికి ఆత్మ గౌరవం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే.. ఎవరి ముందూ తల వంచరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు.

PREV
15
Zodiac signs

ఆత్మ గౌరవం అనేది ప్రతి మనిషికీ ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఆత్మ గౌరవం అనేది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవానికి సంకేతం. జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన వారికి ఆత్మ గౌరవం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే.. ఎవరి ముందూ తల వంచరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా...

25
1.సింహ రాశి...

సింహ రాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి టాలెంట్ చాలా ఎక్కువ. వారు ఎల్లప్పుడూ తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటారు. వీరు ఇతరుల విమర్శలను పెద్దగా పట్టించుకోరు. తాము తీసుకున్న నిర్ణయానికి స్టిక్ అయ్యి ఉంటారు. తమ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోరు. ఎవరైనా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వీరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది.

35
2.వృశ్చికరాశి

వృశ్చికరాశి వారు తమ భావాలను , నిర్ణయాలను ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారు తమ వ్యక్తిగత విలువలను ఇతరుల ముందు వ్యక్తపరచడానికి వెనుకాడరు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారు ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. వారి దృఢమైన వైఖరి , ఆత్మవిశ్వాసం వారిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. వారు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వారు ఎవరినీ ఎప్పటికీ క్షమించరు. వారి ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేసే ఏ అంశం నుండి అయినా దూరంగా ఉండటానికి వారు వెనుకాడరు.

45
3.మకర రాశి..

మకర రాశి వారు చాలా క్రమశిక్షణగా, కఠినంగా ఉంటారు. వారు తమ లక్ష్యాలను , బాధ్యతలను చాలా విలువైనవిగా భావిస్తారు. వారు తమ కృషి, క్రమశిక్షణ ద్వారా ఆత్మగౌరవాన్ని పొందుతారు. వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ, వారు ఎల్లప్పుడూ తమ స్వంత విలువల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మగౌరవమే విజయానికి పునాది అని వారు నమ్ముతారు. కృషి , ఆత్మగౌరవం తమను ఉన్నత స్థాయిలో నిలపడుతుందని ఈ రాశివారు నమ్ముతారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిని వారు అల్పంగా భావిస్తారు. వారి నుండి తమను తాము దూరం చేసుకుంటారు.

55
కుంభరాశి

కుంభరాశి వారు ధైర్యం , దృఢమైన స్వభావానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ ప్రతిభను , సామర్థ్యాలను ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఏదైనా సవాలును ఎదుర్కొనే ధైర్యం వారికి ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి అనుమతించరు. తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తారు. వారు స్వాతంత్ర్యం , విశ్వసనీయతకు విలువ ఇస్తారు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఆత్మ గౌరవం విషయంలో మాత్రం రాజీపడరు.

Read more Photos on
click me!

Recommended Stories