
జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారికి ఓపిక చాలా ఎక్కువ. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు తొందరగా ఎవరినీ బాధపెట్టాలని అనుకోరు. మరీ ముఖ్యంగా తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చినా కూడా తమ మ్యారేజ్ లైఫ్ ని ఆనందంగా మార్చుకోగల సత్తా వీరిలో ఉంటుంది. అందుకే.. వీరు జీవితంలో ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
వృషభ రాశివారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే.. వీరు తమ జీవితంలోకి వచ్చే వ్యక్తితో ఎలాంటి గొడవలు పడరు. ఒకవేళ గొడవ జరిగినా కూడా.. అది ఎక్కువ సేపు ఉండదు. వెంటనే వారిని కూల్ చేసి.. సమస్యను తగ్గించేస్తారు. ఇక.. వృషభ రాశివారు ధనస్సు, మీన రాశులకు చెందిన వారిని పెళ్లాడితే... వారి జీవితం మరింత మధురంగా మారడం పక్కా. ఈ రాశివారికి ఆ రాశులతో కంపాటబులిటీ చాలా బాగా సూట్ అవుతుంది.
మిథున రాశివారు స్వభావరీత్యా కాస్త చంచలంగా ఉంటారు. వీరి మైండ్ చాలా కన్ ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏ విషయంలో అయినా కన్ ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కానీ... పెళ్లి విషయంలో మాత్రం వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినా.. ప్రేమ కి మాత్రం ఏ మాత్రం లోటు చేయరు. కాస్త అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ వస్తే చాలు. పరస్పర అవగాహన వారి వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది.
అయితే, మిథున రాశి వారు మేషం, వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వారు ఈ రాశి వారు కాకుండా వేరే వారిని వివాహం చేసుకున్నా.. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వారి వైవాహిక జీవితంలో వారు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, వాటిని అధిగమిస్తారు. వారు ఒకరినొకరు ఎప్పటికీ వదులుకోరు.మిథున రాశిని తెలివైన గ్రహం బుధుడు పాలిస్తాడు. అందువల్ల, మిథున రాశి వారు ఏ పరిస్థితి గురించి అయినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంపై చెడు దృష్టి పడకుండా ఉండటానికి, సూర్యుడికి పసుపు కలిపిన నీటిని సమర్పించండి. అలాగే, శనిని పూజించండి. ఇది ఇంట్లో ఆనందాన్ని పెంచడమే కాకుండా, పరస్పర విశ్వాసం , ప్రేమను కూడా పెంచుతుంది.
సూర్యుడు సింహరాశి అధిపతి. ఈ రాశి వారి వైవాహిక జీవితం ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, కొంత కాలం తర్వాత అది చాలా మధురంగా మారుతుంది. సింహ రాశి వారు తమ భాగస్వామితో బాగా కలిసిపోరు. కానీ తరువాత ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. కానీ సింహ రాశి వారు మకరం , కుంభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఈ రెండు రాశి వారు కాకుండా ఇతర రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే, మీ భాగస్వామితో సంతోషకరమైన కుటుంబం ఉండాలంటే, ప్రతి శనివారం ఏదైనా దానం చేయండి. ఇది శని చెడును తగ్గిస్తుంది. కుటుంబంలో ఆనందం , శాంతిని తెస్తుంది.
వృశ్చిక రాశి వారి వివాహ జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారి వివాహ జీవితంలో ఎటువంటి తగాదాలు ఉండవు. ఈ జంట ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వారు పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడుకుంటారు. గొడవ జరిగితే, ఇద్దరూ ఓపికగా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తారు, కాబట్టి వివాహంలో తగాదాలు తీవ్రం కావు. కానీ వృశ్చిక రాశి వారు మిథున లేదా కన్య భాగస్వామిని వివాహం చేసుకోకూడదు. ఈ రెండు రాశి వారు తప్ప, మిగతా అన్ని రాశి వారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం వజ్రం లేదా స్ఫటికం ధరించడం చాలా మంచిది.