Zodiac sign: 2026లో ఈ 5 రాశుల వారికి గోల్డెన్ టైమ్‌.. బాబా వంగా చెప్పిన అంచ‌నాలు ఇవే

Published : Dec 24, 2025, 11:05 AM IST

Zodiac sign: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ భవిష్యద్రష్ట బాబా వంగా 2026 సంవత్సరంపై ఆసక్తికరమైన సూచనలు చేశారు. ఆమె అంచనాల ప్రకారం కొన్ని రాశుల జీవితాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంత‌కీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వృషభ రాశి

వృషభ రాశి వారికి 2026 ఆర్థికంగా బలమైన సంవత్సరం కానుంది. ఆదాయ వనరులు పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. ఆస్తి సంబంధిత లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

25
సింహ రాశి

సింహ రాశి వారికి గత కొంతకాలంగా ఎదురైన ఒత్తిళ్లు క్రమంగా తగ్గుతాయి. శని ప్రభావం తగ్గడంతో నిర్ణయాలు స్పష్టంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఉద్యోగ రంగంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆదాయం క్రమంగా మెరుగవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే కాలం ఇది.

35
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అనుకోని అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు కనిపిస్తాయి. పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి.

45
మకర రాశి

మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఇది. ఉద్యోగంలో పదోన్నతులు రావచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా పెరిగే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరే దశకు చేరుకుంటారు.

55
కన్యా రాశి

కన్యా రాశి వారికి కెరీర్ పరంగా మంచి మలుపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలులోకి తెచ్చే అవకాశం దక్కుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories