Zodiac sign: జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అత్యంత నెమ్మదిగా ప్రయణించే శని గ్రహం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. తాజాగా శని మార్గి కారణంగా కొన్ని రాశులపై ప్రభావం చూపనుందని పండితులు చెబుతున్నారు.
శని గ్రహం 28 నవంబర్ 2025 నుంచి సిధ్ధ గమనంలో ప్రయాణించబోతుంది. ప్రస్తుతం శని మేషరాశిలో వక్రచలనం (Retrograde) లో ఉంది. జ్యోతిష్య ప్రకారం వక్రగతిలో ఉన్న శని సమస్యలు, ఆలస్యాలు, ఒత్తిడి పెంచుతుంది. కానీ శని మార్గి అయినప్పుడు అదృష్టం పెరగడం, అవకాశాలు రావడం, అడ్డంకులు తొలగిపోతాయి.
25
శని వక్రం నుంచి మార్గి అవడం ఎందుకు ప్రత్యేకం?
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రహం వక్రం నుంచి మార్గి అవడం శుభ సంకేతం. ఇది జీవితంలో నిలిచిపోయిన అంశాలు మళ్లీ ముందుకు సాగటానికి సహాయం చేస్తుంది. శని ముఖ్యంగా కర్మ, శ్రమ, న్యాయానికి ప్రతీక. అందుకే శని మార్గి అయితే కష్టానికి ఫలితం లభిస్తుంది.
35
ఏ రాశులకు ఎక్కువ శుభఫలాలు?
ఈ మార్పు ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టం తెస్తుంది. అవి.. వృషభం, కన్య, మకరం, కుంభం వంటి రాశులకు మంచి జరగనుంది. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా పడుతోన్న కష్టాలకు ఉపశమనం లభించనుంది.