Zodiac Signs: జాతకంలో గురు చంద్రులు బలంగా ఉంటే చాలు ఆ రాశి వారికి బీభత్సంగా కలిసొస్తుంది. డిసెంబర్ 5న గురు, చంద్ర గ్రహాలు ఒకే రోజు తమ రాశులను మార్చుకోనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్ధికంగా విపరీతంగా కలిసొస్తుంది.
ఒకరి జాతకంలో గురు చంద్రుల స్థానం ఎంతో బలమైనది. ఒకరి జాతకంలో గురు చంద్రులు బలంగా ఉంటే చాలు విపరీతంగా వారికి ఆర్ధికంగా కలిసి వస్తుంది. సాధారణంగా గురుగ్రహం రాశి మారడానికి ఏడాది సమయం పడుతుంది. కానీ చంద్రుడు వేగంగా ఒక రాశి నుంచి మరోరాశికి మారుతాడు. డిసెంబర్ 5న ఈ రెండు గ్రహాలు ఒకే రోజు తమ రాశిని మార్చుకున్నాయి. ఇది 12 రాశులపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశులపై ఈ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితాలు మారుతాయి.
24
కన్యా రాశి
కన్యా రాశి వారికి డిసెంబర్ 5 నుంచి మంచి రోజులు మాట్లాడుతాయి. గుర్రు చంద్ర సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.
34
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు, చంద్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 5 నుంచి ఆత్మవిశ్వాసం, ఆదాయం కూడా పెరుగుతాయి. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి మంచి కాలం మొదలవుతుంది. వీరికి భౌతిక సుఖాలు దక్కే అవకాశం ఉంది. వీరికి వచ్చే ననెలలో ఖర్చులు పెరుగుతాయి… కానీ దానికి తగ్గట్టు ఆదాయం కూడా పెరుగుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే సమయం ఇది. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది.