Zodiac sign: ఈ 3 రాశుల వారికి మంచి రోజులు వ‌చ్చేశాయ్‌.. శుక్ర‌గ్ర‌హ అస్త‌మ‌యంతో ల‌క్కే ల‌క్కు

Published : Dec 13, 2025, 07:29 AM IST

Zodiac sign: గ్ర‌హాల క‌ద‌లిక‌లపై మ‌న జ్యోతిషం ఆధార‌పడి ఉంటుంద‌ని పండితులు చెబుతుంటారు. తాజాగా శుక్ర గ్ర‌హంలో వ‌చ్చిన కీల‌క మార్పు కొన్ని రాశుల‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని అంటున్నారు. 3 రాశుల వారికి క‌లిసిరానుంద‌ని చెబుతున్నారు.  

PREV
15
శుక్ర గ్రహ అస్తమయం అంటే ఏంటి.?

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా ఉద‌యిస్తూ, అస్త‌మిస్తుంటాయి. ఒక గ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు అది క‌నిపించ‌దు. సూర్య కాంతిలో కలిసిపోయే ఈ స్థితినే అస్తమయం అంటారు. డిసెంబర్ 11 నుంచి శుక్రుడు అస్తమ స్థితిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావం 2026 ఫిబ్రవరి 1 వరకు కొనసాగనుంది. ప్రేమ, సుఖాలు, సంపద, దాంపత్య జీవితం వంటి అంశాలపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

25
శుక్రుడి అస్తమ ప్రభావం ఎవరికీ ఎలా?

శుక్రుడు అస్తమించిన సమయంలో కొన్ని రాశులకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం ఈ కాలం అదృష్టాన్ని అందించనుంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం, కుటుంబ ఆనందం, దాంపత్య జీవితం పరంగా మంచి మార్పులు కనిపిస్తాయి.

35
వృషభ రాశి: ఆత్మవిశ్వాసం పెరిగే కాలం

వృషభ రాశివారికి ఈ శుక్ర అస్తమ కాలం అనుకూలంగా ఉంటుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్యాల సాధన దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అనుబంధం బలపడుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి.

45
తుల రాశి: సంబంధాలు బలపడే సమయం

తుల రాశివారికి ఈ దశ ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత దగ్గరవుతుంది. ప్రియమైన వారితో గడిపే సమయం మధురంగా మారుతుంది. సామాజిక పరిచయాలు విస్తరిస్తాయి. పనిలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అప్పులు తీర్చే అవకాశం దక్కుతుంది. వ్యాపార ప్రయాణాల ద్వారా లాభాలు అందే సూచనలు ఉన్నాయి. కెరీర్ కొత్త దిశగా సాగుతుంది.

55
మకర రాశి: కష్టానికి ఫలితం దక్కే దశ

మకర రాశివారికి శుక్ర అస్తమ కాలం లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత పెట్టుబడుల నుంచి లాభాలు అందే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌కు బలమైన పునాదిగా మారతాయి.

గమనిక: జ్యోతిష సూచనలు సాధారణ విశ్లేషణ ఆధారంగా మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. అలాగే పైన తెలిపిన విష‌యాలు ప‌లువురు పండితులు తెలిపిన అంశాలు, ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories