Zodiac sign: జనవరి నెల రెండో వారంలో కుంభ రాశి వారి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. జనవరి 11 నుంచి 17 వరకు కుంభ రాశి వారికి ఎలా ఉండనుందంటే..
జనవరి రెండో వారం కుంభ రాశి వారికి మార్పులు తీసుకొచ్చే సమయం. జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతిగా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అనుభవం ఉన్న వారి సలహా ఉపయోగపడుతుంది.
25
కెరీర్, వ్యాపార పరిస్థితులు
ఉద్యోగం చేస్తున్నవారికి మొదటి రోజులలో కొంత ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు రావచ్చు. ఆగ్రహం పెంచుకోకుండా మౌనంగా పని చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఒక్క అడుగు వెనక్కి వేసినా భవిష్యత్తులో రెండు అడుగులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. లాభనష్టాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
35
ఆర్థిక వ్యవహారాలు
డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ వారం పొదుపు వైపు దృష్టి పెట్టడం మేలు చేస్తుంది.
కుటుంబంలో పెద్దవారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటలతో సమస్యలు పెంచుకోకుండా ఓర్పుగా వ్యవహరించాలి. చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండటం శాంతిని కాపాడుతుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్త అవసరం. భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపికతో ముందుకు సాగితే సంబంధాలు బలపడతాయి.
55
ఆరోగ్యం, చేయాల్సిన పరిహారం
ఈ వారం స్వయంగా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తల్లి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం, విశ్రాంతి విషయంలో క్రమశిక్షణ పాటించాలి.
పరిహారం: ప్రతిరోజూ కనకధారా స్తోత్రం పఠించడం శుభఫలితాలు ఇస్తుంది.
గమనిక: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.