Makara Sankranti: ఒకేసారి మూడు శుభ యోగాలు..సంక్రాంతికి ఈ 4 రాశులకు మహా అదృష్టం

Published : Jan 10, 2026, 07:00 AM IST

 Makara Sankranti: ఈ ఏడాది సంక్రాంతి పండగ వస్తూ వస్తూ కొన్ని రాశుల జీవితాల్లో సంతోషాన్ని నింపనుంది. మకర సంక్రాంతి వేళ ఒకేసారి మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం పెరగనుంది.  

PREV
15
సంక్రాంతి శుభయోగం...

మరో నాలుగు రోజుల్లో మకర సంక్రాంతి పండగ రానుంది. ఈ పండగ వస్తూ వస్తూనే మూడు శుభ యోగాలను తెస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పండగను జనవరి 14వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణం వైపు కదులుతాడు. ఈ పర్వదినం రోజున దానాల మకర సంక్రాంతి 3 శుభ యోగాలను తెస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంక్రాంతి రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం లాంటి మూడు యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కలిసి నాలుగు రాశుల వారి జీవితాలను అద్భుతంగా మార్చనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం.. 

25
మేష రాశి...

మకర సంక్రాంతి శుభ ప్రభావం మేష రాశి వారిపై చాలా ఎక్కువగా ఉండనుంది. ఈ సమయంలో మేష రాశి వారి కెరీర్ అద్భుతంగా మారనుంది.  కీర్తి , ప్రశంసలు కూడా పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు వేగంగా జరుగుతాయి.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఊహించని సైడ్ నుంచి ఆదాయం లభిస్తుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  

35
సింహ రాశి..

సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతాల పెంపుపై శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో ఊరట లభిస్తుంది. ఈ యోగం ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

45
తుల రాశి..

ఈ యోగం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 2025 నుంచి నెరవేరని కోరికలు ఈ ఏడాది నెరవేరుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.

55
మకర రాశి..

మకరరాశిలో సూర్యుడి సంచారం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. పనిలో గౌరవం, కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీరు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories