ఆరోగ్యం....
ఈ తేదీల్లో పుట్టిన వారు ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. వీరు, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామం చేయాలి. సరిగా నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
ఈ తేదీల్లో పుట్టిన వారి..
అదృష్ట రంగులు: బంగారు, పసుపు, ఆకుపచ్చ
అదృష్ట సంఖ్యలు: 1, 5, 7
శుభ ఫలితాలను పెంచుకోవడానికి....
అవసరమైన వారికి దుప్పట్లు, చెప్పులు దానం చేయాలి.
రోడ్డుపై తిరిగే జంతువులకు ఆహారం పెట్టాలి.
ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా జపించాలి.