వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, శని అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శని గ్రహం ఏ రాశిలో అయినా దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అందుకే, శని మళ్లీ ఒక రాశిలోకి అడుగుపెట్టడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. 2027 జూన్ వరకు అదే రాశిలో ఉంటాడు. శని ప్రత్యక్ష కదలికలో ఉండటం వల్ల కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాగా.. 2026లో శని సింహ రాశిలో శక్తివంతమైన విపరీత రాజయోగాన్ని ఏర్పరచనుంది. దీని కారణంగా నాలుగు రాశులకు రాజయోగం పట్టనుంది. ఆ రాశులేంటో చూద్దాం...
ఈ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుంది..?
జోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకకంలోని ఆరో, ఎనిమిదో లేదా పన్నెండవ ఇంటి అధిపతి ఈ ఇళ్లను సంచరించినప్పుడు ఈ విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు, శని సింహం ఆరో ఇంటికి అధిపతి... ఎనిమిదో ఇంటికి సంచరిస్తున్నాడు. అందుకే, ఈ విపరీత రాజయోగం సింహ రాశిలో ఏర్పడుతుంది.