కర్కాటక రాశి...
కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా సున్నితంగా ఉంటారు. వీరు ఏ విషయం గురించి అయినా లోతుగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటారు. వారు సమయం, పరిస్థితులకు అనుగుణంగా మారతారు. ఇతరులు చెప్పిన మాటలను నమ్మి, మోసపోవడం, కోపం తెచ్చుకోవడం వీరు చేయరు. తమ కళ్లతో చూసిన దానిని మాత్రమే నమ్ముతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు చాలా ఓర్పుగా ఉంటారు. కోపంతో ఇతరులను నిందించడం లాంటి తప్పులు వీరు చేయరు.