Karkataka RasiPhalalu: 2026లో కర్కాటక రాశి ఫలితాలు ఇవిగో, వీరికి అష్టమ శని ముగుస్తుందా?

Published : Dec 09, 2025, 06:09 PM IST

Karkataka RasiPhalalu: కర్కాటక రాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది? అష్టమ శనికాలం ముగిసిపోయి మంచి రోజులు మొదలవుతాయా? ఈ రాశివారి ఫలితాలు వచ్చే ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

PREV
15
కర్కాటక రాశి 2026 ఫలితాలు

పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలలో, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశి (Cancer Sign) కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు.

కర్కాటక రాశి వారికి 2026లో కఠినమైన అష్టమ శని కాలం ముగిసిపోబోతోంది. ఇదే వారికి ఎంతో ఊరటనిచ్చే విషయం. అయితే అష్టమ రాహువు రూపంలో కొత్త సవాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు మీ ఒకటవ ఇంట్లో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. దీనివల్ల హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ ఏడాది దైవ రక్షణ లభిస్తుంది. ఎన్ని కష్టాలనైనా విజయవంతంగా దాటుకొని ముందుకు వెళతారు. 2025లో పడిన కష్టాలు అన్నిటి నుంచి బయటికి వచ్చే ఏడాది 2026. ఒక పెద్ద చీకటి సొరంగం నుండి బయటకు వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో భాగ్యస్థానంలో ఏడాది పొడవునా ఉంటాడు. ఈ సంచారం మీకు అదృష్టాన్ని, ఉన్నత చదువులను, మీపై మీకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మీ జీవితాన్నే మారుస్తుంది. ఇక రాహువు ఎనిమిదవ ఇళ్లయిన కుంభరాశిలో డిసెంబర్ 6 వరకు ఉంటాడు. ఈ అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల తెలియని భయం, మానసిక ప్రవర్తనలో మార్పులు, మానసిక ఆందోళన, ఆకస్మికంగా ఏవైనా ఘటనలు జరగడం వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది.

సంవత్సరం ప్రారంభంలో గురుడు.. మిథున రాశిలోకి వెళ్లి జూన్ 1 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల ఆరోగ్యానికి విదేశీ ప్రయాణాలకు, ఆధ్యాత్మిక యాత్రలకు, దానధర్మాలకు డబ్బులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక జూన్ 26 తర్వాత గురుడు ఉచ్ఛ రాశి అయినా కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 వరకు అక్కడే ఉంటాడు. ఇది హంస మహా పురుష యోగాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత సింహరాశిలోకి మారుతాడు. ఇది ఆర్థిక ప్రయోజనాలను కుటుంబ సంతోషాన్ని పెంచుతుంది.

25
ఉద్యోగంలో ఎలా ఉంటుంది?

ఉద్యోగం చేస్తున్న వారికి 2025లో పడిన కష్టాలన్నీ ఈ సంవత్సరంలో తీరుతాయి. ఈ కొత్త ఏడాదిలో మీరు స్థిరపడే అవకాశం ఉంది. తొమ్మిదవ ఇంట్లో శని ఉంటాడు. కాబట్టి ఆయన మీ నుంచి క్రమశిక్షణను కోరుకుంటారు. మీరు క్రమశిక్షణగా, నీతిగా ఉంటే శనీశ్వరుడు నుంచి మీకు మద్ధతు లభిస్తుంది. జూన్, అక్టోబర్ మధ్య ప్రమోషన్లు లేదా పెద్ద బాధ్యతలు మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఇక సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి అంతా మేలే జరుగుతుంది. గురుడు కూడా మీ వ్యాపారానికి తగిన సాయాన్ని అందిస్తాడు. అయితే ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు.

35
ఆర్థిక పరిస్థితిలో మార్పు

సంవత్సరం ప్రారంభంలో కాస్త ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురుడు 12వ ఇంట్లో ఉండడంవల్ల అధిక ఖర్చులకు కారణం అవుతాడు. ఇక రెండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల డబ్బులు వస్తున్నా కూడా చేతిలో నిలవవు. కాబట్టి కొంత డబ్బును పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అష్టమ స్థానంలో రాహువు ఉండడం వల్ల ఆకస్మిక లాభాలు రావచ్చు. అలాగే ఆకస్మిక ఖర్చులు రావచ్చు. వచ్చే యేడాది అక్టోబర్ 31 నుండి ఆర్థికపరంగా అంతా సానుకూలంగా ఉంటుంది. గురు గ్రహం రెండవ ఇల్లు అయినా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది పొదుపు చేస్తారు.

45
ఆరోగ్యం ఎలా ఉంటుంది?

అష్టమ స్థానంలో రాహువు ఉండడం వల్ల కర్కాటక రాశి వారు 2026లో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒత్తిడి బారిన పడతారు. అలాగే ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అయితే సంవత్సరం మధ్యలో వచ్చే హంసయోగం వల్ల ఎంతోకొంత కోలుకుంటారు. సెప్టెంబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు కుజుడు సంచారం జరుగుతుంది. దీనివల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో అధిక శ్రమ, ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

55
ఎలాంటి పరిహారాలు చేయాలి?

అష్టమ స్థానంలో ఉన్న రాహువు పెట్టే కష్టాలను తగ్గించడానికి శివుడుని పూజించండి. క్రమం తప్పకుండా ఓం నమశ్శివాయని జపిస్తూనే ఉండండి. అలాగే దుర్గాదేవిని కూడా పూజించడం ఎంతో మంచిది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడంలాంటివి చేయకండి. ఇక కేతువు కోసం గణేశుడిని ప్రతిరోజు పూజించండి. విష్ణు సహస్రనామాలు గురువారంలో పఠించడం వల్ల గురుగ్రహం మరింత సానుకూలంగా మారుతుంది. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా మంగళ, శనివారాల్లో పఠిస్తే కుజుడు సానుకూలంగా మారుతాడు.

Read more Photos on
click me!

Recommended Stories