నెంబర్ 6....
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ నెంబర్ శుక్ర గ్రహంతో ముడిపడి ఉంటుంది. శుక్రుని దయ కారణంగా... ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా, ఈ తేదీలలో జన్మించిన మహిళలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు. డబ్బు విషయంలో తమ భర్తకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూ ఉంటారు.
డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు...
న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. చాలా ఉదారంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఖర్చు చేసినా కూడా వీరి చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళల జీవితం ఎప్పుడూ మధురంగా ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. కొత్త కొత్త ప్లేసులను చుట్టేస్తూ ఉంటారు.