Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Published : Mar 01, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 01.03.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

513
కర్కాటక రాశి ఫలాలు

బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

613
సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యల నుంచి బయటపడతారు.

713
కన్య రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాల వల్ల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాలలో కొన్నిఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకు వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వృథా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అప్పులు తీర్చగలగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదాయం బాగుంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

సంతానంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు శ్రమకు ఫలితం లభిస్తుంది.

1313
మీన రాశి ఫలాలు

అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేయడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. వృత్తి , ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories