Zodiac sign: ప్రస్తుత గ్రహ సంచారం వల్ల కొన్ని రాశులకు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు బలపడతాయి. మరికొన్ని రాశులకు బాధ్యతలు, పనిభారం పెరుగుతుంది. మొత్తం మీద వచ్చే వారం 4 రాశుల వారికి కలిసిరానుందని శాస్త్రం చెబుతోంది.
ఈ రాశి వారికి వచ్చే వారం ఆదాయ ప్రవాహం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధిక లక్ష్యాలు అప్పగిస్తారు. పనిభారం ఎక్కువై తీరిక లేని రోజులు గడుస్తాయి. వ్యాపారాల్లో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో, బయట బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగం, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. కుటుంబ సంబంధిత సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఖర్చులు కొంత పెరిగినా రుణ భారం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే అన్నీ బాగానే ఉన్నా.. జీవిత భాగస్వామితో మాటల విషయంలో సంయమనం పాటించడం మంచిది.
24
ధనుస్సు వారికి ఎదుగుదల
ఈ రాశి వారికి వచ్చే వారం శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఎదుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందవచ్చు. తోబుట్టువుల నుంచి సహాయం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆస్తి సంబంధిత వివాదం ఒకటి పరిష్కార దిశగా వెళ్తుంది. కుటుంబ సహకారంతో కీలక ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.
34
వృషభం
ఈ కాలంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఎదురుకావు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. పని ప్రదేశంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో లభిస్తాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తగ్గుతాయి. కుటుంబ పెద్దల సహకారం అందుతుంది. కొంత ఖర్చుతో పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సౌకర్యంగా సాగుతుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ సమాచారాలు అందుతాయి.
ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ కారణంగా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వైద్యులు, న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి అనుకూల సమయం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చులు ఉన్నా కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.