చెవి కుట్టించుకోవడానికి రాహు, కేతువులతో ప్రత్యక్ష సంబంధం ఉందని జ్యోతిషం చెబుతోంది. ఇవి మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, తప్పుడు నిర్ణయాలకు కారణమవుతాయి. చెవి కుట్టించుకుంటే రాహు, కేతువులు శాంతిస్తారని నమ్మకం.
అదృష్టం పెరుగుతుందా..?
చెవి కుట్టించుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు రావడానికి దారులు ఏర్పడతాయి. జాతకంలో రాహు, కేతువులు బలహీనంగా ఉంటే, అభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి.
చెవి కుట్టించుకోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. సైన్స్ ప్రకారం, చెవులు శక్తి కేంద్రాలకు అనుసంధానమై ఉంటాయి. చెవి కుట్టించుకుంటే ఒత్తిడి తగ్గి, శక్తిని నిల్వ ఉంచుతుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
అయితే.. కేవలం అబ్బాయిలు కుడి చెవి మాత్రమే కుట్టించుకోవాలి. శాస్త్రాల ప్రకారం ఎడమ చెవి కుట్టించుకోవడం అశుభంగా పరిగణిస్తారు.