Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి శత్రువులే ఉండరు.. అందరూ ఆప్తులే!

Published : Dec 23, 2025, 02:59 PM IST

సాధారణంగా మనలో చాలామందికి శత్రువులు ఉంటారు. నిజానికి శత్రుత్వం అనేది ద్వేషం వల్ల మాత్రమే కాదు.. మన ఆలోచనలు, ప్రవర్తనల వల్ల కూడా ఏర్పడుతుందని చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుడి ప్రకారం కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తులకు అసలు శత్రువులే ఉండరు తెలుసా? 

PREV
17
ఎలాంటి వ్యక్తులకు శత్రువులు ఉండరు?

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో బోధనలు చేశారు. ఈనాటికి చాణక్య నీతి సూత్రాలను పాటించే వాళ్లు చాలామందే ఉన్నారు. చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలు, విలువలు కలిగిన వ్యక్తులకు శత్రువులే ఉండరు. ఆ లక్షణాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

27
వినయం కలిగిన వ్యక్తులు

అపారమైన జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ వినయంగా ప్రవర్తించే వ్యక్తికి శత్రువులు ఉండరని చాణక్య నీతి చెబుతోంది. గర్వం ఇతరుల హృదయాల్లో ద్వేషాన్ని పుట్టిస్తే, వినయం గౌరవాన్ని పెంచుతుంది. ఎంత తెలిసినా దాన్ని ప్రదర్శించకుండా, ఇతరులను తక్కువగా చూడకుండా వ్యవహరించే వ్యక్తి చుట్టూ శాంతి ఉంటుంది. 

37
మితంగా మాట్లాడే వ్యక్తి

మితంగా మాట్లాడే వ్యక్తికి కూడా శత్రువులు ఉండరు. అనవసమైన మాటలు, కఠినమైన మాటలు శత్రుత్వానికి దారితీస్తాయని చాణక్యుడు హెచ్చరించాడు. ఆలోచించి, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి తన మాటల వల్ల ఎవరినీ గాయపరచడు. అలాగే స్వార్థం లేకుండా న్యాయంగా ప్రవర్తించే వ్యక్తికి కూడా శత్రువులు ఉండరని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది. స్వార్థంతో చేసిన పనులు ఇతరులకు నష్టం కలిగించి వారిలో ద్వేషాన్ని పెంచుతాయి. కానీ న్యాయంగా జీవించే వ్యక్తి ఎవరికి అన్యాయం చేయడానికి ఇష్టపడడు. 

47
దాన గుణం కలిగిన వ్యక్తి

దానం చేసే గుణం కలిగినవారికి కూడా శత్రువులు ఉండరని చాణక్య నీతి చెబుతోంది. దానం అనేది కేవలం డబ్బు రూపంలోనే కాదు.. సహాయం, సానుభూతి, జ్ఞానం రూపంలో కూడా ఉండాలి. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకొని చేయూతనిచ్చే వ్యక్తి ఎప్పుడూ వారి మనసులో మంచి స్థానం సంపాదిస్తాడు.

57
హద్దుల్లో ఉండే వ్యక్తి

తన పరిమితులను తెలుసుకొని ప్రవర్తించే వ్యక్తి అనవసర శత్రుత్వాలకు దూరంగా ఉంటాడు. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతాడు. ఇలాంటి వ్యక్తి వివాదాలను నివారిస్తాడు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే శత్రువులను పోగు చేసుకున్నట్లే అని చాణక్యుడు హెచ్చరించాడు.

67
క్షమా గుణం కలిగిన వ్యక్తి

సహనం, క్షమా గుణం కలిగిన వ్యక్తికి శత్రువులు ఉండరు. కోపంతో వెంటనే ప్రతిస్పందించే వ్యక్తి చిన్న సమస్యను కూడా పెద్దగా చేసి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. కానీ సహనంతో స్పందించే వ్యక్తి శత్రువునే మిత్రుడిగా మార్చగల శక్తిని కలిగి ఉంటాడు. అలాగే నిజాయతీగా జీవించే వ్యక్తికి కూడా శత్రువులు తక్కువగా ఉంటారు. అబద్ధం, మోసం తాత్కాలిక లాభాన్ని ఇచ్చినా, చివరకు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకువస్తాయి. 

77
గౌరవించే స్వభావం

ఎవరినీ అవమానించకుండా, అందరినీ గౌరవించే స్వభావం కలిగినవారికి శత్రువులు ఉండరని చాణక్య నీతి బోధిస్తుంది. ఎదుటివాడి స్థాయి ఏదైనా అతని గౌరవాన్ని కాపాడే వ్యక్తి సమాజంలో శాంతిని నెలకొల్పుతాడు.

Read more Photos on
click me!

Recommended Stories