చాలా మంది తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. దిష్టి తగలకుండా ఉండాలని, ఎవరి చెడు కన్ను పడినా దాని ప్రభావం తగలకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు నల్లదారాన్ని శని దేవుడితో ముడి వేస్తారు. పౌరాణనిక విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని నల్లదారాన్ని కట్టుకుంటే, మరి కొందరు ఫ్యాషన్ కోసం కట్టుకుంటారు. కానీ.. ఎవరు పడితే వాళ్లు... నల్లదారం కట్టుకోకూడదట. కొందరికి నల్లదారం కట్టుకోవడం వల్ల లాభం కలిగితే.. మరి కొందరికి నష్టం కలుగుతుందట. మరి.. ఇది ఎవరు కట్టుకోకూడదో తెలుసుకుందాం...
నల్లదారాన్ని కట్టుకునే ముందు.. జోతిష్యుల సలహా తీసుకోవాలట. ఎందుకంటే నల్లదారం శని దేవుడితో సంబంధం ఉంటుంది. కాబట్టి.. అన్ని రాశుల వారికి నల్లదారం మేలు చేయకపోవచ్చు.