ఈ 4 తేదీల్లో పుట్టిన వారు.. భార్యలను బంగారంలా చూసుకుంటారు..!

First Published | Oct 8, 2024, 1:25 PM IST

న్యూమరాలజీ ప్రకారం  నాలుగు తేదీల్లో పుట్టిన పురుషులు తమ జీవితంలోకి వచ్చిన భార్యను  చాలా ప్రేమగా చూసుకుంటారట. బంగారం కంటే ఎక్కువ గాా భావిస్తారట. 

పెళ్లి తర్వాత ఎవరి జీవితం అయినా మారిపోతుంది. పెళ్లి అనగానే ఏవేవో ఊహించుకుంటాం. ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ముఖ్యంగా అమ్మాయిలు.. తమ భర్త తమను ప్రపంచంలో ఎవరూ ప్రేమించినంతగా ప్రేమించాలని కోరుకుంటారు.  అయితే... అది అందరి జీవితంలో జరగదు. కానీ... న్యూమరాలజీ ప్రకారం..నాలుగు తేదీల్లో పుట్టిన అబ్బాయిలు మాత్రం.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిలను చాలా బాగా చూసుకుంటారట. అమితంగా ప్రేమిస్తారట.

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 4 అంటే... 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన అబ్బాయిలు..తమ భార్యలను చాలా ప్రేమిస్తారట.  ఈ తేదీల్లో జన్మించినవారు తమ భార్యలను చాలా గౌరవిస్తారు. ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తారు. వారు తమ వైవాహిక జీవితంలో పూర్తిగా నిజాయితీగా ఉంటారు. తన భార్యను ప్రేమించడం నుండి ఆమెను బాగా చూసుకోవడం వరకు ఆమె గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామిని కూడా చాలా సంతోషపెడతారు. 
 


ఈ తేదీల్లో జన్మించిన పురుషులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో ఉండటానికి ఇష్టపడతారు. వారికి బంధాలు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఈ పిల్లలు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఏమైనా చేస్తారు.

అంతేకాదు, ఈ తేదీల్లో జన్మించినవారి భార్యలు అదృష్టవంతులు. అలాంటి భర్త దొరికితే ఆ అమ్మాయి జాతకం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధి ప్రక్రియలో ముందుకు సాగుతారు.

Latest Videos

click me!