కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం... ఈ నాలుగు రాశులకు కష్టమే..!

First Published | Oct 10, 2024, 3:19 PM IST

అక్టోబర్ 20వ తేదీన  కుజుడు..కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.  అంగాకర గ్రహం శక్తి , బలం, ధైర్యానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. కాగా.. ఈ మార్పులు.. నాలుగు రాశుల వారికి ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. మరి, ఆ నాలుగు రాశులేంటో ఓసారి చూద్దాం....

జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాల కదలికలు.. కొన్ని రాశులవారికి మేలు చేస్తే.. మరి కొన్ని రాశుల వారికి సమస్యలను తెచ్చిపెడతాయి. ప్రస్తుతం అక్టోబర్ 20వ తేదీన  కుజుడు..కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.  అంగాకర గ్రహం శక్తి , బలం, ధైర్యానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. కాగా.. ఈ మార్పులు.. నాలుగు రాశుల వారికి ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. మరి, ఆ నాలుగు రాశులేంటో ఓసారి చూద్దాం....

telugu astrology


1.మేష రాశి..
కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం..మేష రాశివారికి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టనుంది. కుటుంబ సభ్యలతో కలహాలు వచ్చేఅవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు రానున్నాయి. అవనసరపు ఖర్చులు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే..అనేక వ్యాదులు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది.


telugu astrology

2.సింహ రాశి..
కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం సింహ రాశివారికి ఇబ్బంది కరంగా మారుతుంది. సింహ రాశి వారు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటారు. చేసిన పని చెడిపోవచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో గొడవలు వచ్చే పరిస్థితి రావచ్చు. ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు.

telugu astrology

3.ధనస్సు రాశి..

కుజుడు రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి కెరీర్ లో అనేక సమస్యలు ఎదురుకావచ్చు. మీరు ఉద్యోగాలను మార్చడం గురించి ఆలోచించవచ్చు. కొత్త ఒప్పందాలను ఖరారు చేసే ముందు పారిశ్రామికవేత్తలు జాగ్రత్తగా ఆలోచించాలి. పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా ఎవరి సలహానైనా తీసుకోండి, లేకుంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

telugu astrology

4.మీన రాశి..
మీనం మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వివాహితులు కలహాలను ఎదుర్కోవచ్చు.

Latest Videos

click me!