Zodiac signs: నవంబర్ బుధ-శుక్ర కలయిక... ఈ ఐదు రాశులకు ఊహించని సమస్యలు..!

Published : Oct 18, 2025, 01:20 PM IST

 Zodiac signs: నవంబర్ లో బుధుడు, శుక్రుడు కలయిక ఏర్పడనుంది. బుధుడు తెలివి తేటలకు చిహ్నం అయితే, శుక్రుడు విలాసాలకు మారుపేరు. ఈ రెండింటి కలయిక కొన్ని రాశులకు సమస్యలు తెచ్చి పెట్టనుంది. 

PREV
16
zodiac signs

జోతిష్య శాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొన్ని గ్రహాలు శుభ యోగాలు ఏర్పరితే.. కొన్ని గ్రహాలు మాత్రం సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి మార్పే నవంబర్ లో జరగనుంది. నవంబర్ 25న బుధ గ్రహం, శుక్ర గ్రహం కలయిక ఏర్పడుతుంది. ఈ రెండూ విరుద్ధ భావాలు ఉండటం వల్ల వీటి మధ్య సారుపత్య ఉండదు. దీని వల్ల... ఈ నవంబర్ నెలాఖరున ఐదు రాశుల వారికి సమస్యలు రానున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం.....

26
1.మేష రాశి...

బుధ-శుక్ర గ్రహ కలయిక మేష రాశివారికి సమస్యలు తెచ్చి పెడుతుంది. తొందరపాటు పనుల వల్ల సమస్యలు రావచ్చు. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెడితే నష్టాలు రావచ్చు. కాబట్టి.. ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. తెలివిగా ఖర్చు చేయాలి. లేకపోతే... ఎక్కువ ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. మానసిక సమస్యలు ఎదుర్కుంటారు. కోరుకున్నది ఏదీ జరగక ఇబ్బంది పడతారు.

36
మిథున రాశి...

.

నవంబర్ లో మిథున రాశివారు కూడా ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులు చేయాలి. లేకపోతే అప్పుల బారిన పడే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త వారితో ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసికంగా కృంగిపోతారు.

46
ధనస్సు రాశి..

ఈ రాశివారికి నవంబర్ చివర్లో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. ఆఫీస్ లో పని ఒత్తిడి పెరుగుతుంది. చేతిలో డబ్బులు ఊరికే ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. నిద్ర సరిగా ఉండదు. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. యోగా, ధ్యానం లాంటివి చేయాలి. లేకపోతే... ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

56
.వృషభ రాశి...

పనిలో అడ్డంకులు ఉండవచ్చు. తొందరపాటు తో చేసే పనుల వల్ల నష్టాలు ఉండవచ్చు. ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి పొదుపు చేయడం చాలా అవసరం. అనవసరమైన షాపింగ్‌కు దూరంగా ఉండండి. అలసట, సోమరితనం పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. జీవితం మీరు కోరుకున్నంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోకపోతే ఎక్కువ ఇబ్బంది పడతారు.

66
కన్య రాశి..

మీరు సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆర్థిక ప్రమాదాలను నివారించండి. ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోండి. శారీరక సౌకర్యం ఉన్నప్పటికీ,మానసిక సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories