Zodiac signs: ధనత్రయోదశి రోజున ఏ రాశివారు ఏం కొనాలి?

Published : Oct 17, 2025, 03:20 PM IST

Dhanteras: ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, మీ రాశి ప్రకారం.. ఏది కొంటే మంచి జరుగుతుందో తెలుసుకొని కొంటే లక్ష్మీ కటాక్షం పొందగలరు.

PREV
113
Dhanteras

దీపావళి పండగ కంటే ముందే.. మనం ధన త్రయోదశి జరుపుకుంటాం. ఈ రోజు నుంచే ఐదు రోజుల దీపావళి పండగ ప్రారంభమౌతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18న జరుపుకోనున్నారు. ఈ రోజున చాలా మంది బంగారం, వెండి లాంటివి కొనుగోలు చేస్తారు. వీటిని కొనడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. అయితే, జోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశివారు ఏది కొనుగోలు చేయాలి? ఏది కొంటే శుభప్రదం అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

213
మేష రాశి....

మేష రాశిలో జన్మించిన వ్యక్తులు ధనత్రయోదశి రోజున కాంస్య ప్రాతలు లేదా వెండి నాణేలు కొనుగోలు చేయడం శుభప్రదం. వీటిని కొనుగోలు చేయడం వల్ల మేష రాశివారి వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

313
వృషభ రాశి...

ధన త్రయోదశి రోజున వృషభ రాశివారు బంగారం, వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం. ఈ వస్తువుల కొనడం వల్ల వీరి అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

413
మిథున రాశి

మిథున రాశి వారు ధన త్రయోదశి రోజున కాంస్య పాత్ర లేదా పచ్చ కొనడం మంచిది. ఈ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, మిథున రాశి వారు మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా వ్యాపారంలో విజయం సాధించి వారి సంపదను కూడా పెంచుకుంటారు.

513
కర్కాటక రాశి.

కర్కాటక రాశివారు ధంతేరాస్ రోజున లక్ష్మీదేవి , గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. మట్టివి అయినా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఆనందం, శాంతి , అదృష్టం కలుగుతాయి.

613
సింహరాశి

సింహరాశి వారు ఈ ధనత్రయోదశి రోజున బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. ఈ వస్తువులను కొనడం ద్వారా, మీరు మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను చూడవచ్చు . మీరు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు.

713
కన్య రాశి..

ఈ సంవత్సరం ధనత్రయోదశి రోజున కన్య రాశి వారు కాంస్య పాత్రలు లేదా పూజా వస్తువులను కొనడం మంచిదని చెబుతారు. ఈ వస్తువులను కొనడం ద్వారా, కన్య రాశి వారు వారి ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి.

813
తుల రాశి..

తుల రాశి వారు ఈ పవిత్రమైన రోజున బంగారు చెవిపోగులు లేదా దేవతల వెండి విగ్రహాలు కొనుగోలు చేయాలి. ఈ వస్తువులను కొనడం వల్ల తుల రాశి వారి వైవాహిక జీవితంలో మాధుర్యం వస్తుంది. మీరు ఆర్థిక శ్రేయస్సు పొందుతారు.

913
వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారు ఈ పవిత్రమైన రోజున చీపుర్లు, పాత్రలు లేదా అలంకరణ వస్తువులు వంటి గృహోపకరణాలను కొనడం శుభప్రదమని చెబుతారు. ఈ వస్తువులను కొనడం వల్ల ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అదృష్టం పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి..

ఈ సంవత్సరం ధనత్రయోదశి నాడు ధనుస్సు రాశి వారు గృహాలంకరణలు, బంగారు ఆభరణాలు లేదా కాంస్య పాత్రలను కొనుగోలు చేయాలి. ఈ వస్తువులను కొనుగోలు చేయడం వలన ధనుస్సు రాశి వారి ఇంట్లో ఉత్సాహం, ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయి.

1113
మకర రాశి..

మకర రాశి వారు ధనత్రయోదశి రోజున ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయాలి. ఈ వస్తువులు మతపరంగా మరింత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఇవి కొనడం వల్ల మకర రాశివారి ఆనందం పెరుగుతుంది.

1213
కుంభ రాశి..

ఈ సంవత్సరం ధనత్రయోదశి రోజున కుంభ రాశి వారు వెండి ఆభరణాలు , రాగి పాత్రలను కొనుగోలు చేయడం శుభప్రదమని చెబుతారు. ఈ వస్తువులను కొనుగోలు చేయడం వలన కుంభ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మీరు చాలా ఆర్థిక పురోగతిని సాధించడానికి మంచి అవకాశాలు కూడా పొందుతారు.

1313
మీన రాశి...

ఈ సంవత్సరం ధనత్రయోదశి రోజున మీన రాశి వారు బంగారం లేదా వెండి ఆభరణాలు లేదా వాహనం కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. ఈ వస్తువులను కొనడం వల్ల మీన రాశి వారికి సంపద , అదృష్టం పెరుగుతుంది. దీనితో పాటు, మీరు జీవితంలో పురోగతికి మంచి అవకాశాలను పొందుతారు. అదృష్టం కూడా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories