
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
శ్రమతో కానీ పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు.
దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.
వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
నూతన వాహనయోగం ఉంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
నూతన వాహన యోగం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.