
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. తలనొప్పి లేదా అలసట వంటి సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలం. ఉద్యోగాలలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల ద్వారా లాభాలు రావచ్చు. ఆదాయం బాగుంటుంది. కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారు ఈ వారం కొత్త ఆలోచనలు, ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. తోటివారితో సఖ్యతగా ఉంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్పష్టత పెరుగుతుంది.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టాలి. ఉద్యోగాలలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి వారికి ఈ వారం నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ, కృషి ఫలితంగా ప్రాజెక్టులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి మంచి సమయం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. ప్రేమ, స్నేహ సంబంధాల్లో సహనం, ఓపిక అవసరం.
తుల రాశి వారు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో తోటివారి సహకారం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం. కానీ తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదు. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతగా కలిసిరావు.
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. స్నేహితులు, సోదరుల మద్ధతు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి వారికి ఈ వారం కలిసివస్తుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. ప్రేమ సంబంధాలు సానుకూలంగా సాగుతాయి.
మకర రాశి వారికి ఈ వారం క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు టైంకి పూర్తి చేస్తారు. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి. కానీ పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
కుంభ రాశి వారికి ఈ వారం సృజనాత్మకత, చురుకుదనం పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
మీన రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో కాస్త ఓపికగా ఉండాలి. పై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.