Saturn Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలో పాదం మారుతున్న శని.. ఈ 3 రాశులకు జాక్‌పాట్

Published : Feb 22, 2026, 06:47 AM IST

Saturn Transit జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ఫిబ్రవరి 22l శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మొదటి పాదం నుంచి రెండో పాదంలోకి ప్రవేశించాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
14
శని నక్షత్ర సంచారం

జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 22న శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మొదటి పాదం నుంచి రెండో పాదంలోకి అడుగుపెడుతున్నాడు. మార్చి 21 వరకు అక్కడే ఉంటాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో ఉంటుంది. దీనికి అధిపతి కూడా శని దేవుడే కాబట్టి ఆయన అక్కడ చాలా బలంగా ఉంటాడు.  శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం… అందుకే దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది.

24
మేష రాశి

ఈ శని ఉత్తరాభాద్రలోని రెండో పాదంలోకి అడుగుపెట్టడం మేష రాశి వారికి శుభ సమయాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతో కాలంగా  పెండింగ్‌లో ఉండిపోయిన పనులు పూర్తవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఈ రాశి వారు బలంగా మారుతారు. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది.

34
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని సంచారం అనేది  ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలను అందిస్తోంది. జీవితంలో ఉన్న పాత సమస్యలు తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

44
మీన రాశి

మీన రాశిలోనే శని సంచారం జరగుతోంది. కాబట్టి వీరికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.  వారికి వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, శాంతి వంటివి నెలకొంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories