Sun Transit: సంవత్సరం తర్వాత ఆ రాశిలోకి సూర్యుడు, నవంబర్ లో ఈ నాలుగు రాశులకు డబ్బే డబ్బు..!

Published : Oct 11, 2025, 04:28 PM IST

Sun Transit: దాదాపు సంవత్సరం తర్వాత గ్రహాల రాజు సూర్యుడు అంగారకుడి ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు నాలుగు రాశులకు స్వర్ణయుగంగా మారనుంది. కెరీర్ లో పురోగతి, అపారమైన ఆర్థిక లాభాలు కూడా కలగనున్నాయి. 

PREV
15
సూర్య సంచారం..

సూర్యుడు దాదాపు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతుంటాడు. దాదాపు సంవత్సరం తర్వాత అంటే నవంబర్ లో సూర్యుడు అంగారక గ్రహం పాలించే వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం... నాలుగు రాశుల వారికి అదృష్టం తేనుంది. ఎంతలా అంటే... ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఊహించని వైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా....

25
1.సింహ రాశి...

సూర్యుని సంచారం సింహ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే, అవి తీరిపోతాయి. ఈ కాలంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ వ్యాపారం చేసినా బాగా కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

35
2.వృశ్చిక రాశి...

సూర్యుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టడం ఈ రాశివారికి శుభ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో మీ పని చేసే విధానం మెరుగుపడుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. చేసే పనిలో కూడా అభివృద్ధి పొందుతారు. వీరు తమ పనితో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

45
3.మకర రాశి.....

సూర్యుని సంచారం తో మకర రాశివారి లైఫ్ మొత్తం మారిపోనుంది. వీరి అదృష్టం పెరుగుతుంది. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారవేత్తలకు ఇది చాలా అనుకూల సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.

55
4.కుంభ రాశి...

సూర్యుని సంచారం కుంభ రాశి వారికి సానుకూల మార్పులను తెస్తుంది. సూర్యుడు మీ జాతకంలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి, ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. అదే సమయంలో, మీరు పనిలో గొప్ప శాంతిని పొందుతారు మీరు మీ కెరీర్‌లో ఆకస్మిక మార్పును అనుభవించవచ్చు. ఉద్యోగులు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories