Weekly Horoscope: 12 రాశుల వార ఫలాలు.. ఈ వారం ఏ రాశివారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసా?

Published : Jul 12, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 12.7.2026 నుంచి 18.7.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు ఎదురైనా, మీ నిర్ణయ సామర్థ్యం మీకు సహాయపడుతుంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మంచిది. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు, ఆస్తి విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. వ్యాపార భాగస్వాములతో స్పష్టత అవసరం. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నా అనవసర ఖర్చులను నియంత్రించాలి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశివారి మాటతీరు, ఆలోచనా విధానం విజయానికి తోడ్పడుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

413
మిథున రాశి ఫలాలు

ఈ వారం మిథున రాశివారికి ఆర్థిక విషయాలు సానుకూలంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వచ్చినా వాటి ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహాలు కలిసివస్తాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయాలి. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

ఈ వారం సింహ రాశివారికి ఆత్మపరిశీలన అవసరం. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాల విషయంలో పూర్తి పరిశీలన అవసరం. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నా అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ విషయాల్లో మీ సహనం కీలకంగా మారుతుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన ముఖ్యం. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది.

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి ఈ వారం కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో మీ క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యవహారాల్లో లాభదాయకమైన మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా ప్రణాళికతో వ్యవహరిస్తే మంచి ప్రయోజనం పొందుతారు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.

813
తుల రాశి ఫలాలు

ఈ వారం తులరాశి వారికి సంబంధాలు, భాగస్వామ్య విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. విద్యార్థులు తమ లక్ష్యాలపై స్పష్టతతో ముందుకు సాగాలి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సామర్థ్యం బయటపడుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. వ్యాపారులకు పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఈ వారం ధనుస్సు రాశివారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనా విధానం, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ప్రయోజనకరంగా మారతాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్య, కొత్త విషయాల అభ్యాసంలో మంచి పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

1113
మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగంలో మీ క్రమశిక్షణ, పట్టుదల ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించవచ్చు. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆస్తి, ఇంటి విషయాల్లో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో చదివితే మంచి ఫలితాలు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారు ఈ వారం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మీ క్రియేటివిటీకి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు భాగస్వామ్యాలు, కొత్త పరిచయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే వృథా ఖర్చులను నియంత్రిచడం మంచిది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని చదవాలి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం.

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం అవసరం. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. పెద్దల సలహాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories