రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి మారడం వల్ల కన్య రాశి వారికి గొప్ప శుభ ఫలితాలు దక్కనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బు సులభంగా చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి, కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. చాలా కాలంగా ఉన్న పెళ్లి అడ్డంకులు తొలగిపోయి, మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఇల్లు, భూమి, బంగారం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.