కన్యరాశివారు ఈ రోజు ఖర్చును విపరీతంగా చేస్తారు. ఖర్చులు పెరగడంతో మానసికంగా గంధరగోళంగా ఉంటారు. అందుకే అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వాయిదా చెల్లింపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
ఉద్యోగం, వ్యాపారం
ఈ రోజు కన్యారాశి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. అధికారులు కొత్త పనులను అప్పగిస్తారు. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పనులు పూర్తి కావు. దీంతో మీరు అధికారులచే మాటలు పాడాల్సి వస్తుంది. సహచరులతో సశ్యతగా ఉండటం మంచిది. ఇది మీ సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుందది. అందులో బాగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపార వేత్తలకు ఈ రోజు నిరాశే మిగులుతుంది. లాభాలు తగ్గి ఒప్పందాలు లేట్ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి.