తుల రాశి...
తుల రాశి వారికి, శుక్రుని ఈ సంచారము పదకొండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఈ సంచారము తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశిచక్రానికి అధిపతి. ఈ కాలంలో, తులారాశి వారికి ఆర్థిక లాభాలు, సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులు , ఉన్నతాధికారులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. దీని కారణంగా కార్యాలయంలో మీ పనితీరు బాగుంటుంది. వ్యాపారవేత్తలకు, ఈ సమయం భాగస్వామ్యంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి , లాభాలను ఆర్జించడానికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి లాభాలు రావచ్చు. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు ఉంటాయి. మీ భాగస్వామితో సమయం గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.