Venus Transit: రేపటి నుంచి శుక్రుని అనుగ్రహంతో ఈ అయిదు రాశుల వారు ఇల్లు, కారు కొనే ఛాన్స్

Published : Sep 02, 2025, 04:50 PM IST

శుక్రుడు జీవితంలో ప్రేమ,  భౌతిక సుఖాలను అందించే గ్రహం.  సెప్టెంబర్ 3 2025న శుక్రుడు పుష్య నక్షత్రం నుండి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం అయిదు రాశులవారికి భీభత్సంగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది.  ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
15
కర్కాటక రాశి

సెప్టెంబరు 3న శుక్రుని నక్షత్రం మార్పు కర్కాటక రాశి వారికి అదృష్టం కలుగుతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి కూడా శుక్రుని వల్ల విపరీతంగా కలిసి వస్తుంది. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బు మీ చేతికి అందుతుంది. 

25
కన్యా రాశి

కన్యా రాశి వారికి సెప్టెంబరు నెల కలిసి వస్తుంది. ఈ సమయం వీరికి చాలా శుభప్రదం. పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా లాభాలు వస్తాయి.  వ్యాపారస్థులకు ఇది బాగా కలిసొచ్చే అవకాశం. మీ కొత్త ఇంటి కల నెరవేరుతుంది. కొందరు కారు కనే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. 

35
తుల రాశి

తులా రాశికి అధిపతి శుక్రుడు.అందుకే శుక్రుడి నక్షత్రం మార్పు వీరికి  బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారిలో ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ రావచ్చు. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే సినిమాలు,  మీడియా,  సంగీతం రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన విజయం లభిస్తుంది. వీరి అధికంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.

45
ధనుస్సు రాశి

సెప్టెంబరులో శుక్రుని వల్ల ధనుస్సు రాశి  వారికి అదృష్టం దక్కుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మికంగా డబ్బుల కలిసి రావచ్చు.  ఆస్తి కొనేందుకు మీరు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో ఇతరులతో కలిసి భాగస్వామ్యంగా ఉంటే అది లాభదాయకంగా ఉంటుంది. మీకు ఈ నెల ఖర్చులు పెరిగినప్పటికీ అదే స్థాయిలో పొదుపు పెరుగుతుంది.

55
కుంభ రాశి

శుక్ర సంచారం కుంభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. విదేశ ప్రయాణం చేసే అవకాశం మీకు వస్తుంది. కారు, ఇల్లు వంటి పెద్ద కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో  కూడా మాధుర్యం పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories