Vastu Tips: ప‌శ్చిమ దిశ‌లో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? శ‌ని ఆగ్రహం తప్పదు

Published : Sep 02, 2025, 04:26 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. శనిదేవుడు పశ్చిమ దిశకు అధిపతిగా చెబుతారు. ఈ దిశలో జరిగే పొరపాట్లు ఆయన అసంతృప్తికి దారి తీస్తాయి. ఇంత‌కీ ప‌శ్చిమ దిశ‌లో చేయ‌కూడ‌ని త‌ప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పశ్చిమ దిశలో శనిదేవుడి ఆధిపత్యం

జ్యోతిష్యం ప్రకారం శని న్యాయదేవుడు, కర్మ ఫలితాలను అందించే గ్రహం. ఇంటిలో పశ్చిమ దిశ ఆయన ఆధీనంలో ఉంటుంది. ఈ దిశలో నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ విభేదాలు రావచ్చు. అదే సమయంలో సక్రమంగా చూసుకుంటే ఆయన అనుగ్రహంతో సుఖసంపదలు కలుగుతాయి.

25
పశ్చిమ దిశలో వంటగది ఉండ‌కూడ‌దు

వాస్తు నిబంధనల ప్రకారం, పశ్చిమ దిశలో వంటగది ఉండకూడదు. ఇలా ఉంటే ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడుతుందని న‌మ్ముతారు. అదేవిధంగా, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశముంది. కాబట్టి వంటగదిని దక్షిణ-ఆగ్నేయ (అగ్ని మూల) దిశలో ఉంచడం శ్రేయస్కరం.

35
వీటి నిర్మాణం అస్స‌లు వ‌ద్దు

పశ్చిమ దిశలో గుడి లేదా పూజా స్థలం ఏర్పాటు చేయడం శుభకరం కాదు. అలాగే, ఈ దిశలో బాత్రూమ్, బెడ్‌రూమ్ లేదా పెద్ద బాల్కనీ ఉండకూడదు. ఇప్పటికే ఈ నిర్మాణాలు ఉంటే, నీటి మూలకం ఉన్న వస్తువులు (జలపాతం ఫొటో లేదా చిన్న నీటి ఫౌంటెన్) ఉంచడం వ‌ల్ల‌ ప్రతికూలతలు తగ్గుతాయని చెబుతారు.

45
ఫర్నిచర్ వాడకంలో జాగ్రత్తలు

పశ్చిమ దిశలో ఫర్నిచర్ ఉంచడంలో తప్పులేదు. కానీ అవి ఎల్లప్పుడూ శుభ్రంగా, క్రమబద్ధంగా ఉండాలి. విరిగిన కుర్చీలు, పాత చెత్త వస్తువులు, ఉపయోగం లేని సామాను ఈ దిశలో ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ త‌గ్గుతుంది. కాబట్టి ఫర్నిచర్‌ను స‌క్ర‌మంగా ఏర్పాటు చేసుకోవాలి.

55
శుభ్రత, సమతుల్యతతో శని ఆశీర్వాదం

పశ్చిమ దిశను శుభ్రంగా ఉంచితే శనిదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇది జీవితంలో సమతుల్యతను పెంచి, కుటుంబంలో ఐక్యతను తీసుకొస్తుంది. శనిని కఠిన గ్రహంగా భావించినప్పటికీ, ఆయనను సంతృప్తి పరచగలిగితే సౌభాగ్యం, ధనం, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories